#


Index

మోక్ష సన్న్యాస యోగము

వాడు బ్రాహ్మణుడు.దానికి తగినట్టే నడుచుకొంటాడు జీవితంలో. ఈ నడతను బట్టే వాడి గుణాలను పోల్చుకోవచ్చు మనం.

శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం - యుద్ధే చాప్యపలాయనం
దాన మీశ్వర భావశ్చ - క్షాత్రం కర్మ స్వభావజమ్ - 43

  పోతే క్షత్రియు డెవడంటే చెబుతున్నాడు. శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం శూరత్వమూ ప్రాగల్భ్యమూ ధైర్యమూ సామర్థ్యమూ - యుద్ధేచా ప్యపలా యనం - యుద్ధంలో వెనక్కు తగ్గక పోవటమూ. దానమీశ్వర భావశ్చ. పాత్రుడైన వాడికి దానం చేయటమూ. ఆధిపత్యం కలిగి ప్రవర్తించటమూ. ఇలాటి వన్నీ క్షత్రియుడిలో కనపడే వ్యవహారం. బ్రాహ్మణుడిది సత్త్వగుణ ప్రధానం కాబట్టి వాడి కర్మ సాత్త్వికంగానే ఉంటుంది. ఆవే శమదమాదులు. మరి క్షత్రియుడిది రాజసం కాబట్టి దాని కనుగుణంగా నడుస్తుంది వాడి వ్యవహారం. అవే శౌర్య ధైర్యాదులు.

కృషి గౌరక్ష్య వాణిజ్యం - వైశ్యకర్మ స్వభావజం
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ - 44

  పోతే వైశ్య కర్మ వర్ణిస్తున్నాడు. కృషి గౌరక్ష్య వాణిజ్యం. కృషి అంటే వ్యవసాయం. గౌరక్ష్యమంటే పాశుపాల్యం. ఆవులను గేదెలను కాచుకోటం. వాణిజ్యం సరే తెలిసిందే. క్రయ విక్రయాది వ్యవహారం. ఇదంతా పూర్వం వైశ్యులు చేసే వృత్తులే. రజోగుణ ప్రభావ మెక్కువగా

Page 469

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు