ఇది ఇంతకు ముందే వచ్చిందసలు గీతలో. చాతుర్వర్ణ్యం మయా సృష్టమనే చోట ఉదాహరించాడు మహర్షి ఈ విషయం. అదే భావమక్కడ సూత్రప్రాయంగా చెప్పింది ఇక్కడ వ్యాఖ్యానించి చూపుతున్నాడాయన. వారి వారి గుణాలకు తగినట్టు వారెలా నడుచుకొంటారో ప్రస్తుతం వారి కర్మలు బయటపెడుతున్నాడు. మానసికమైనది వారి గుణమైతే బాహ్యమైనది వారి ప్రవర్తన. అదే కర్మ అంటే. దీనితో మానవుల జీవితమంతా కలిసి వచ్చింది.
శమో దమస్తవ శ్శౌచం - క్షాంతి రార్జవ మేవచ
జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం - బ్రహ్మ కర్మ స్వభావజమ్ - 42
బ్రాహ్మణుడి స్వభావానికి తగినట్టే వారి కర్మ ఉంటుంది. అదే బ్రహ్మ కర్మ అంటే. ఏమిటది. ఎలా ఉంటుంది. శమో దమః - శమమూ దమమూ. అంతరింద్రియ నిగ్రహ మొకటి. బహిరింద్రియ నిగ్రహమొకటి. తపశ్శాచం. తపస్సంటే మంచి ఆలోచన. శౌచమనేది బాహ్యాభ్యంతర శుద్ధి. క్షాంతి రార్జవ మేవచ. క్షమే క్షాంతి సహన శీలత్వం. ఆర్జవమంటే ఋజు బుద్ధి ఋజు ప్రవర్తన. జ్ఞానం విజ్ఞానం. జీవిత గమ్యమేదో దాన్ని గుర్తించటం జ్ఞానమైతే దాన్ని అనుభవానికి తెచ్చుకోటం విజ్ఞానం. ఆస్తిక్యం. పోతే అలాటి దాన్ని దీక్షగా పట్టుకోవాలంటే అది నిజంగా ఉందనే నమ్మకం బ్రహ్మాండంగా ఉండాలి వాడికి. అలాటి దైవ గుణాలున్న వాడైతే
Page 468