#


Index

మోక్ష సన్న్యాస యోగము

మనేది మనకు చెప్పటమేమో చెప్పారు. కాని అది మన మాచరణలో పెట్టగలమా అంటే పెట్టగలము - పెట్టలేమంటారు వారు. ఉత్తమ మధ్యమ మందాతి మంద భేదాలున్నాయి గదా మానవులలో. అందరికీ ఒకే జ్ఞాన కర్మ సామర్థ్య ముండదు. అది ఎలాగో వర్ణిస్తున్నా డిప్పుడు గీతాచార్యుడు.

బ్రాహ్మణ క్షత్రియ విశాం - శూద్రాణాంచ పరంతప
కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్లుణైః - 41

  మానవులందరూ ఒకటి గారు. ఒకటి కారంటే మానవ జాతిలో పుట్టినవారే అందరూ. కాని తేడా ఉన్నది. అది శరీర మనః ప్రాణాలను బట్టి కాదు. ఉపాధి ఒక్కటే అయినా ప్రకృతి గుణాల కలయికలో తేడా ఉంటుంది. స్వభావ ప్రభవై ర్గుణైః స్వభావమంటే ప్రకృతి. అవిద్యా రూపంగా అది మనలో పని చేస్తున్నది. దానివల్ల ఏర్పడ్డవే సత్త్వరజస్తమస్సులనే గుణాలు. అవి ఒక్కొక్కరిలో ఒక్కొక్క మోతాదులో అభివ్యక్తమై కనిపిస్తుంటాయి. గుణాలు వారి లోపల ఉంటే అవి చేసే పనులు బయటపడి కనిపిస్తాయని అర్థం చేసుకోవాలి మనం. అసలు వారి వారి గుణ వైవిధ్యాన్ని బట్టే కర్మాణి ప్రవిభక్తాని. వారి కాయా కర్మలన్నీ వేర్వేరుగా నిర్దేశించింది శాస్త్రం. వారు కూడా తమ తమ గుణాల కనుగుణంగా ఆయా కర్మలా చరిస్తుంటారు. ఎంత చెడ్డదైనా మానుకోలేరు. ఎంత మంచిదైనా చేయలేరు. గుణాన్ని బట్టి కర్మ అయితే కర్మను బట్టి వారి గుణాన్ని పోల్చుకోవచ్చు మనం.

Page 466

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు