గాని ఒక్కటి కూడా కానరాదు. పిపీలి కాది బ్రహ్మ పర్యంత మంతా ఈ త్రిపురాసురుల కాహుతి కావలసిందే. దివి దేవేషువా అనటంలో మానవులే గాదు. దేవలోకాలలో ఉన్న దేవతలకు కూడా త్రిగుణాల బంధం తప్పదని అర్థమవుతున్నది. దీన్నిబట్టి దేవలోక ప్రాప్తి దేవతాసాయుజ్యమని ఉపాసకులు కలగంటున్నారే అదికూడా మోక్షం కాదు. జీవిత సమస్య కే మాత్రమూ పరిష్కారం కాదని తేలిపోయింది.
ఇదీ భగవద్వాణి. అలాంటప్పుడిక బంధం తప్ప విడిచి మోక్షమనే దాని కాస్కారమే మున్నదని ప్రశ్నరావటం సహజమే. కాని ప్రశ్న ఉందంటే దానికి సమాధానం కూడా ఉండి తీరుతుంది. సమాధానమే లేకుంటే శాస్త్రోపదేశమే నిరర్థకం. అయితే అది మానవుడి బుద్ధికి వెంటనే స్ఫురించక పోవచ్చు. ప్రాకృతమైన బుద్ధికి కాకపోయినా అప్రాకృతమైన స్థాయిలో మహనీయులైన పెద్దలకా సూక్ష్మం తప్పకుండా స్ఫురించి తీరుతుంది. అలాటి స్ఫూర్తితోనే ఉపనిష దృషులూ వేదవ్యాసాది మహర్షులూ మనకు బోధిస్తూ వచ్చారా ఉపాయాన్ని. దాన్ని అమలు పరచటంలోనే సర్వ శ్చగీతా శాస్త్రార్థః ఉపసంహర్తవ్యః వస్తుంది. అంతేకాదు. ఏతావా నేవచ సర్వ వేద స్మృత్యర్థః - వేదశాస్త్ర పురాణేతిహాస ప్రయోజన మంతా ఇందులోనే సమసి పోతుందని వ్రాస్తారు. భాష్యకారులు. అయితే ఎటూ వచ్చీ శాస్త్రమూ సద్గురువులూ తరణోపాయ గీతా శాస్త్ర ప్రయోజన మంతా కలిసి
Page 465