#


Index

మోక్ష సన్న్యాస యోగము

నడుపుతున్నవి సత్త్వరజస్తమో గుణాలు. అవిద్యా పరికల్పితః సమూలః అనర్ధః ఉక్తః చివరకంతా అవిద్యా కల్పితమే ఇది. అనర్థ దాయకమే మనకు. పురుషోత్తమాధ్యాయంలో ఇంతకు ముందే పేర్కొన్నారు. ఊర్ధ్వమూల మధశ్శాఖ మని. అసంగ శస్త్రేణ ఛిత్వా అని. కాని సర్వస్య త్రిగుణాత్మక త్వాత్ సంసార కారణ నివృత్త్య నుప పత్తా ప్రాప్తాయాం యధా తన్నివృత్తిః స్యాత్తధా వక్తవ్యం. అంతా త్రిగుణాత్మకమే అయినప్పుడిక సంసార కారణమైన అవిద్య ఎలా తొలగిపోతుందని ప్రశ్న వచ్చిందిప్పుడు.

నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః
సత్త్వం ప్రకృతి జైర్ముక్తం - యదేభిః స్వాత్తి భిర్గుణైః - 40

  ప్రశ్న రావటం సహజం కూడా. ఎందుకంటే నతదస్తి పృధివ్యాం దివి దేవేషు వా సత్త్వం - మన ఈ మానవలోకంలో గాని ఆ దేవలోకాలలో గాని ఎక్కడైనా సరే. సత్త్వం. అది ప్రాణి కావచ్చు. అప్రాణి కావచ్చు. తేడా లేదు. దేవతలే వారు చాలా గొప్పవారు గదా. వీరంటే మానవ మాత్రులు వీరిదేముంది. ఇక పశుపక్ష్యాదులూ వృక్ష గుల్మాదులైతే మరీ నికృష్టమైనవి. లెక్కేమిటని అణుమాత్రం కూడా తేడా కానరాదు. ఏవిషయంలో. చెబుతున్నాడు వినండి. ప్రకృతి జై ర్ముక్తం యదేభిః స్యా త్రిభిర్గుణైః - ప్రకృతికి సంబంధించిన ఈ సత్త్వ రజస్తమో గుణాల బంధంలో నుంచి తప్పించుకొని బయటపడ్డ స్థావరం గాని జంగమం

Page 464

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు