#


Index

మోక్ష సన్న్యాస యోగము

ముఖ్యమైన ఉపాధి బుద్ధి. దాని కేర్పడే వృత్తి జ్ఞానం. దానితో వాడు ప్రతిక్షణమూ చేసేది కర్మ - వాటన్నిటి కున్న బలం ధృతి. తద్ద్వారా వాడే పనిచేసినా దానివల్ల కలిగే ఫలం చివరకు సుఖం. కాగా ఇందులో ప్రతి ఒక్క దానిలో మూడు భూమిక లుంటాయి. అవి వీడికి ప్రకృతి గుణాలైన సత్త్వరజస్తమస్సుల వల్ల ఏర్పడుతున్నాయి. అందులో సాత్త్వికమైతే అది దైవ సంపద. రాజస తామసాలైతే చెప్పనక్కర లేదు. అది అసుర సంపద. ఇంతకు పూర్వమే వచ్చింది దైవాసురా ధ్యాయంలో ఈ విషయం. దైవీ సంప ద్విమోక్షాయ నిబంధా యా సురీ మతా అని. దీన్ని బట్టి ఈ కర్త దగ్గరి నుంచి వాడికి కలిగే సుఖానుభవం వరకూ ఆరు దశలలోనూ సాత్త్వికమైన లక్షణాలనే అలవరుచుకొంటే ధన్యుడు మానవుడు. వాడే పురుషార్ధాన్ని సాధించటాని కర్హుడు. తప్పకుండా ఎప్పటికైనా జీవిత లక్ష్యమైన మోక్ష సుఖాన్ని చవిచూడగలడు. లేదా కనిపెట్టుకొనే ఉంది ఆసురమైన రాజస తామసాలు - అధః పాతాళానికి వాణ్ణి అణగదొక్క టానికి. కాబట్టి మానవుడికిది ఒక గొప్ప పరీక్ష. ఇటా అటా ఎటు వైపు చేయాలివాడు ప్రయాణం. సంసారమా సాయుజ్యమా. నిర్ణయించు కోవలసిన బాధ్యత వాడిదే.

  ఇదే మరొక విధంగా మనకు బోధ చేస్తున్నారు భాష్యకారులు. సర్వ స్సంసారః క్రియాకారక ఫల లక్షణః సత్త్వ రజస్తమో గుణాత్మకః సంసారమంతా క్రియా కారక ఫలమని మూడిండితో కలిసి ఉన్నది. వాటిని

Page 463

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు