#


Index

మోక్ష సన్న్యాస యోగము

వల్ల కలిగే సుఖానికి మాత్రం నిలకడ ఎక్కడిది. కనుకనే అది రాజస మన్నారు.

యదగ్రేచానుషంగేచ సుఖం మోహన మాత్మనః
నిద్రాలస్య ప్రమాదోత్థం - తత్తామస ముదాహృతమ్ - 39

  పోతే ఇక తామసం. అది అసలు సుఖమే కాదు. సుఖాభాస. ఎందుకంటే యదగ్రేచ అనుబంధేచ మోహన మాత్మనః ఆదిలో అంతంలో కూడా అది మోహనమే మానవుడికి. మోహనమంటే మోహాన్ని కలిగించేది. మోహమేమిటి. ఒక మైకం లాంటిదది. మైకం కమ్మినట్టు కమ్ముతుంది మానవుడి బుద్ధిని. దేనివల్ల ఏర్పడు తుందలాటి జాడ్యం. నిద్రాల స్య ప్రమాదోత్థం. దేనివల్ల ఏమిటి. నిద్ర కావచ్చు. ఏమరుపాటు కావచ్చు. సోమరితనం కావచ్చు. ఏదయినా కావచ్చు. అన్నీ పనికిరాని లక్షణాలే. వాటి మూలంగా తయారవుతుంది. తమస్సులాగా ఆవరిస్తుంది. తత్తామస ముదాహృతం - అందుకే తామసమైన సుఖమన్నారు దాన్ని. ఒక నిద్ర మొహం వాడిలో బద్దకస్థుడిలో తాగుబోతు వాడిలో నిత్యమూ మనకు దర్శన మిస్తుంటుందది.

  ఇక్కడికి చెప్పవలసిన దంతా చెప్పి ముగించింది గీత. ఏమిటది. ఒకసారి పునశ్చరణ చేసుకొంటే జ్ఞానం - కర్మ - కర్త - బుద్ధి - ధృతి సుఖం - ఇవీ ఇంతవరకూ చెప్పిన విషయాలు. కర్త మానవుడు. వాడికున్న

Page 462

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు