#


Index

మోక్ష సన్న్యాస యోగము

పరిపాకానికి వస్తే అమృతోపమం అంతకుముందు విషంలాగా మింగుడు పడని ఆ అభ్యాసమే అమృతం లాగా ఆనంద దాయక మవుతుందట. ఇది విద్వాంసులందరి అనుభవం. ఆత్మ బుద్ధి ప్రసాదజం. వారు తమ బుద్ధి అంతకంతకు జ్ఞానధ్యానాదుల చేత నిర్మల మయ్యే కొద్దీ చవిచూడగలిగా రలాటి సుఖం. ఆత్మ బుద్ధి అంటే ఆత్మ విషయమైన ఆత్మావలంబనమైన బుద్ధి అని భాష్యకారుల మాట. అందుకే ఆత్మలాగా అది ప్రసన్నం. దీనికే సాత్త్వికమైన సుఖమని పేరు.

విషయేంద్రియ సంయోగా ద్యత్త దగ్రే మృతోపమమ్
పరిణామే విషమివ - తత్సుఖం రాజసం స్మృతమ్ -38

  దానికి భిన్నంగా యత్త దగ్రే అమృతోపమం. ఏది ఆరంభంలో అమృతం లాగా ఆహ్లాదాన్ని కలిగిస్తుందో పరిణామే విషమివ. పర్యవసానంలో అదే హాలా హల విషంగా మారి ప్రాణం తీస్తుందో అది రాజసం. అందుకు కారణ మేమంటే విషయేంద్రియ సంయోగాత్ బాహ్యమైన శబ్ద స్పర్శాదులతో చక్షురాదీంద్రియాలు సంబంధం పెట్టుకోటం మూలంగా ఏర్పడే సుఖమది. అది తాత్కాలికమే గాని శాశ్వతం కాదు. శబ్ద స్పర్శాదులు స్థిరంగా ఉంటే గదా. తజ్జన్యమైన సుఖం శాశ్వతం కావటానికి. అనుక్షణమూ మారిపోయే స్వభావం వాటిది. వాటిని గ్రహించే ఇంద్రియ శక్తులు కూడా అలాంటివే. అలాంటప్పుడు వాటి సంసర్గం

Page 461

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు