#


Index

మోక్ష సన్న్యాస యోగము

తామసమైన ధృతి. గుణత్రయ భేదాన్ని అనుసరించి క్రియాకార కాదులన్నిటికీ మూడు విధములైన భేదాలూ పేర్కొన్నాడు. పోతే ప్రస్తుతం వాటి ఫలమైన సుఖంలో కూడా భేదాన్ని చూపుతున్నాడు.

సుఖం త్విదానీం త్రివిధం - శృణుమే భరతర్షభ
అభ్యాసా ద్రమతే యత్ర - దుఃఖాంతంచ నిగచ్ఛతి - 36

  సుఖమనే దేమిటో ఇక చెబుతున్నాను విన మంటున్నాడు. అభ్యాసా ద్రమతే యత్ర. అది పదే పదే భావన చేసే కొద్దీ అందులోనే తృప్తి పొందుతుంటాడు మానవుడు. అంతే కాదు. దుఃఖాంతంచ నిగచ్ఛతి. సుఖం మీద సుఖమను భవించే కొద్దీ కొంత కాలానికి విసుగు చెంది ప్రాపంచికమైన సుఖం నిత్య సుఖం కాదని గుర్తించి దుఃఖం పూర్తిగా తొలగిపోయే సుఖమేమిటా అని దాని వైపు కూడా మొగ్గుచూపే నిశ్చయ జ్ఞానం కూడా ఏర్పడే అవకాశ ముంటుంది. అదే చివరకు పరమ పురుషార్ధానికి తోడ్పడుతుంది. కాబట్టి సుఖమనే దేమిటో దాని స్వరూపం కూడా తెలుసుకోటం మంచిది.

యత్త దగ్రే విషమివ - పరిణామే ఽమృతో పమమ్
తత్సుఖం సాత్త్వికం ప్రోక్త - మాత్మ బుద్ధి ప్రసాదజమ్ - 37

  అందులో సాత్త్వికమైన సుఖమెలా ఉంటుందో చెబుతున్నాడు. అగ్రే విషమివ. ధ్యాన వైరాగ్య సమాధ్యాదు లభ్యసించే టప్పుడు మొదట్లో చాలా శ్రమ అనిపిస్తుందది. అంతటితో ఆగిపోకుండా అవి కాలక్రమేణా

Page 460

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు