#


Index

మోక్ష సన్న్యాస యోగము

యయా తు ధర్మ కామార్థాన్ - ధృత్యా ధారయతేఽర్జున
ప్రసంగేన ఫలాకాంక్షీ - ధృతిస్సా పార్థ రాజసీ - 34

  పోతే రాజసమైన ధృతి ఏదో తెలుసా. యయాతు ధర్మకామార్ధాన్ ధారయతే. ధర్మమేదో అర్థమేదో కామమేదో మూడు పురుషార్ధాలనూ దేనిపాటికది ఏమిటో ఎలా ఉంటుందో మనసులో నిర్ధారణ చేసుకొనేది రాజసబుద్ధి. అంతేకాదు. అలా నిశ్చయించుకొని దానినే ఆచరించి తత్ప్రసంగంతో దానికను రూపమైన ఫలం కూడా తనకు లభించాలని కోరి చేస్తే అది రాజస బుద్ధి అని గ్రహించాలి మానవుడు.

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ
న విముంచతి దుర్మేధా - ధృతిస్సా తామసీ మతా - 35

  మరి తామసమెలా ఉంటుందంటే వర్ణిస్తున్నాడు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ. నిద్రా భయం విషాదం మదం. ఇలాంటి వేవి కూడా హేయంగా కనపడవు వానికి హేయం కావంటే ఉపాదేయమే ఎప్పుడూ. న వి ముంచతి. వదలి పెట్టకుండా అనుక్షణమూ వాటినే సేవిస్తూ ఉంటాడు. దుర్మేధాః - వాడి బుద్ధి అలాంటిది. దానికి మంచి ఆలోచన రాదు. బాగు పడాలని లేదు. ఏదో పశుపక్ష్యాదులు బ్రతికినట్టు ఆహార నిద్రా భయాదులతోనే కాలం గడుపుతుంటాడు. ఎవడలా విడవకుండా వాటిని ధరించే ఉండాలను కొంటాడో వాడికున్న ఆ ధృతి

Page 459

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు