#


Index

మోక్ష సన్న్యాస యోగము

ధృత్యాయయా ధారయతే - మనః ప్రాణేంద్రియ క్రియాః
యోగేనా వ్యభిచారిణ్యా - ధృతి స్సా పార్థ సాత్త్వికీ - 33

  బుద్ధి విషయ మయిం దిక్కడికి. అందులో మూడు భేదాలూ. చూపాడు. పోతే ఇక ధృతి అనే దాని విషయం మాటాడుతున్నాడు. అందులోనూ ఉన్నాయి సాత్త్వికాది భేదాలు మూడూ. వాటిలో మొదట సాత్త్వికమైన ధృతి ఏకరువు పెడుతున్నాడు. ధృత్యా అవ్యభిచారిణ్యా అవ్యభిచారి అయిన ధృతి ఉండాలట. ఏమాత్రమూ చలించగూడదు. అదే ధైర్యమన్నా ధారణ అన్నా. అలా చలించని దైతేనే యయా ధారయతే మిగతా వాటినది ధరిస్తుంది. కదలకుండా చూస్తుంది. ఏమిటా మిగతావి. మనః ప్రాణేంద్రియ క్రియాః - మనస్సూ ప్రాణమూ. వాటి రెండింటికీ సంబంధించిన ఇంద్రియాలూ. ఇక్కడ ప్రాణమే ధృతి అని మనం పేర్కొన్నా దానికి కూడా కావాలి. ధృతి అనేది. అందులో ధృతి రూపంగా అది శక్తి. ప్రాణా పానరూపంగా వ్యక్తి అని అర్థం చేసుకోవాలి మనం.

  మనః ప్రాణాది వ్యాపారాలను ధరించటమంటే ఏమిటి. యోగేన సమాధి బలంతో. అవి దేనిపాటికి దాన్ని వదిలేస్తే అపమార్గంలో ఇష్టానుసారం వెళ్లిపోతాయి. తన్మూలంగా పురుషార్ధానికి నోచుకోలేడు మానవుడు. కాబట్టి నిత్యసమాధితో కూడిన ధారణా బలంతో కళ్లెం చేత బట్టి గుఱ్ఱాన్ని మళ్లించినట్టు వెనక్కు మళ్లించ గలిగి ఉండాలి. అలా మళ్లించే సామర్థ్యమేదుందో అది సాత్త్వికమైన ధృతి.

Page 458

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు