కాగా ఏ బుద్ధి ధర్మాన్నీ అధర్మాన్నీ కార్యాన్నీ అకార్యాన్నీ, ఉన్నదున్నట్టుగా గాక అయధావత్ అస్పష్టంగా ప్రజానాతి. భావిస్తుందో బుద్ధిస్సా రాజసీ అది రాజసమైన బుద్ధి. అంటే ధర్మమేదో అధర్మమేదో స్పష్టంగా ఉన్నదున్నట్టు తెలుసుకోలేని బుద్ధి. అలాగే ఏది శాస్త్రోక్తమైన కర్మో ఏది కాదో వివరంగా తెలుసుకోలేనిది. అలా తెలిసీ తెలియక నడుచుకొనేదేదో అది రాజసమైన బుద్ధి.
అధర్మం ధర్మ మితి యా - మన్యతే తమసా వృతా
సర్వార్ధాన్ విపరీతాంశ్చ - బుద్ధి స్సా పార్థతామసీ -32
ఇక తామస బుద్ధి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. అధర్మాన్నే ధర్మమని భావిస్తుందది. అకార్యమే కార్యమనీ భావిస్తుంది. అసలివే గాదు. సర్వార్ధాన్ విపరీతాన్. జ్ఞేయమైన పదార్ధమేదైనా సరే. అది ఎలా ఉందో అలా గాక దానికి విపర్యయంగా Opposite చూస్తూ పోతుందా బుద్ధి. దానికి కారణం తమసావృతా. తమో గుణం బాగా మనసును కప్పి వేయటమే. చీకట్లో తాడును చూస్తే తాడులాగా కనిపిస్తుందా. తాడు పాములాగా కనిపిస్తుంది - అలా కనిపిస్తే ఎంత ప్రమాదం. అలాగే ధర్మ మధర్మంగా అధర్మం ధర్మంగా భావిస్తే ఏమవుతుంది. ధర్మం గోచరం కాదు. కనుక ధర్మం చేయలేడు. దాని బదుల ధర్మం గోచరిస్తుంటుంది గనుక అధర్మం చేయకుండా పోడు. అంతకన్నా ప్రమాదకర మేముంది.
Page 457