#


Index

మోక్ష సన్న్యాస యోగము

మూడూ ఇప్పుడు వరుసగా పేర్కొంటున్నాడు మహర్షి. ఊరక పేర్కొనటం కాదు. అశేషేణ - ఇక మిగులూ తగులూ లేకుండా వర్ణిస్తాడు. పృథక్త్వేన సమగ్రం గానే గాక వేర్వేరుగా కూడా నిరూపించబోతాడు.

ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయాభయే
బంధం మోక్షంచ యా వేత్తి - బుద్ధి స్సా పార్థ సాత్త్వికీ - 30

  మొదట బుద్ధిలో ఉండే మూడు భేదాలూ వర్ణిస్తున్నాడు. అందులో సాత్త్వికమైన బుద్ధి ఎలాటిదంటే చెబుతున్నాడు. ప్రవృత్తించ నివృత్తించ. ఏది కర్మ మార్గమో ఏది మోక్షమార్గమో స్పష్టంగా తెలిసి ఉండాలి దానికి. అంతేకాదు. కార్యాకార్యే. శాస్త్ర విహితమైన కర్మలూ తెలిసి ఉండాలి. శాస్త్ర నిషిద్ధమైనవీ తెలిసి ఉండాలి. అలాగే భయా భయే. ఏది జీవితానికి భయావహమో ఏదికాదో అదీ తెలియాలి. బంధ మోక్షాలలో బంధమనేది భయావహం. కార్యాకార్యాలలో అకార్యమనేది భయాపాదకం. అలాగే ఆ రెండింటిలో మోక్షం దానికనుకూలమైన కర్మ రెండూ అభయంకరం. ఇలా మన జీవితానికేది పనికి వచ్చేది ఏది కాదని దేని పాటికది వివరంగా తెలుసుకొని తదనుగుణంగా నడుచుకోమని చెప్పేదేదో అది సాత్త్విక బుద్ధి.

యయా ధర్మ మధర్మంచ కార్యం చా కార్యమేవచ
అయధావ త్ప్ర జానాతి - బుద్ధి స్సా పార్థ రాజసీ - 31

Page 456

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు