#


Index

మోక్ష సన్న్యాస యోగము

రెండింటినీ పట్టుకొన్నాడిప్పుడు మహర్షి. రాక్షసి ప్రాణం చిలకలో ఉన్నదున్నట్టు వీటిలో దాగి ఉన్నదా మూడింటిలో భేదం. అదేదో నిర్దేశిస్తున్నా డిప్పుడు.

బుద్ధే ర్భేదం ధృతే శ్చైవ - గుణత స్త్రీవిధం శృణు
ప్రోచ్య మాన మశేషేణ పృథక్త్వేన ధనంజయ - 29

గుణతః - సత్త్వాది గుణ త్రయాన్ని బట్టి మానవుడి బుద్ధి మూడు విధాలు. ప్రోచ్య మానం. అదే నేనిప్పుడు నీకు వినిపిస్తున్నాను విను. ఒక బుద్ధే గాదు. దానితో పాటు ధృతేశ్చైవ. ధృతి కూడా ఉన్నది. ధరించేదేదో అది ధృతి. ధారణ అన్నా ఇదే. ఒక విధంగా చెబితే బుద్ధి ధృతి అంటే మనసూ ప్రాణ మనుకోవచ్చు. ఇవి రెండే శరీరాన్ని నడుపుతున్నాయి. రెండూ తాము చలిస్తూ మిగతా శరీరేంద్రియ చలనానికి తోడు పడుతుంటాయి. అందులో ప్రాణ చలనమే అసలు చలనం. మనశ్చలనం కూడా దానిమీదనే ఆధారపడి ఉంది. మనసు జ్ఞానశక్తి అయితే ప్రాణం క్రియా శక్తి. ఇవి రెండూ సమష్టి మీద శివశక్తులే మరలా. అవే ఈ గణపతి దేహంలో మనః ప్రాణాలనే వేషం వేసుకొని వచ్చి కూచున్నాయని కూడా చెబుతూ వచ్చాము.

  కాగా ఇవి పేరుకు దేనిపాటికది ఒకటిగానే కనిపిస్తున్నా ఒక్కొక్కటి సత్త్వాది గుణాలను బట్టి మూడేసి అవతారాలెత్తి కనిపిస్తుంటుంది. అవి

Page 455

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు