#


Index

మోక్ష సన్న్యాస యోగము

ప్రాకృతుడు. ఏమాత్రమూ సంస్కారం లేక పుట్టినవాడు పుట్టినట్టు బ్రతికే వాడు. స్తబ్ధః దానికి తోడు ఎవరికీ తలవంచని పొగరు బోతు. శఠః శక్తి ఉన్నా ఒళ్లోముకొని బ్రతికేవాడు. నైకృతికః - వారికీ వీరికీ జుట్టూ జుట్టూ ముడివేసి మనఃస్పర్ధలు సృష్టిస్తుంటాడు. అలసః - దేనికీ కలిసి రాకుండా తప్పించుకొని తిరిగేవాడు. విషాదీ. ఎప్పుడూ నా గతి ఇలా పట్టింది నేనేమి చేయగలనని మానసికంగా లేని విషాదాన్ని ఆపాదించుకొనేవాడు. దీర్ఘసూత్రీచ. ఏపని గానీ వెంటచే చేయాలని సుముఖత చూపక రోజుల తరబడి మాసాల తరబడి వాయిదా వేస్తూ పోయేవాడు. కర్తా తామసః ఇలాటి స్వభావమున్న పెద్ద మనిషికి తామసుడని పేరు. ఇలాటి వారూ లేక పోలేదు లోకంలో. కావలసి నంత మంది దొరుకుతారు మనకు. రాజసులు Cynics అయితే వీరు Sadists. ఒకరెప్పుడూ తమలో తాము కుళ్లి కుళ్లి ఏడ్చేవారూ. ఇంకొకరు పరాయి వారెందుకు బాగుపడాలని వారిని కూడా బాధించి తద్వారా ఆనందించేవారు. వీరేగా నూటికి తొంబదిమందీ లోకంలో మనకు దర్శనమిచ్చే ప్రబుద్ధులు.

  పోతే ఇక బుద్ధి ధృతి - ఇవి రెండూ కనిపించాయి గీతాచార్యుడికి. జ్ఞానం కర్మ కర్త - ఈ మూడింటిలో తేడా చూస్తున్నామంటే దానికి కారణమేదో గాదు. ఒకటి మానవుడి బుద్ధి రెండు దానికున్న ధైర్యగుణం ఇవేనని భావించి వీటిలో తేడాయే వాటిలో ప్రతిఫలిస్తున్నది గనుక ఆ

Page 454

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు