#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

విషయాలలోనూ తొందర పడకుండా సహనం వహించటం. ఆర్జవం ఋజుత్వం. ముక్కుకు సూటిగా తాను మంచిదని నమ్మినది నిజాయితీగా పాటించటం. అడ్డదారులు తొక్కకుండా పోవటం. ఆచార్యోపాసనం సద్గురువుల నాశ్రయించి దానివల్ల అధ్యాత్మ విద్యాశ్రవణం చేయటం శౌచం - బాహ్యంగా స్నానాదులు చేసి శరీర మాలిన్యమూ ఆభ్యంతరంగా ప్రతిపక్ష భావన చేసి మనో మాలిన్యమూ తొలగించుకోటం. స్థైర్యం స్థిరత్వం. మోక్ష మార్గంలో గట్టిగా నిలబడటం. ఆత్మ వినిగ్రహః ఆత్మ అంటే ఇక్కడ కార్యకరణ సంఘాత మని వ్రాశారు భాష్యకారులు శరీరమూ ఇంద్రియాలూ. వీటి రెండింటినీ నిత్యమూ అదుపులో ఉంచుకోటం. ఎందుకంటే వాటి పాటికి వాటిని వదిలేశా మంటే చెప్పిన మాట వినవు. విచ్చల విడిగా పనికిమాలిన పనులు పెట్టుకొని మంచి మార్గానికే మాత్రమూ తోడ్పడవు. కనుక సన్మార్గంలోనే వాటిని ప్రవర్తింప జేయటం చాలా మంచిది.

  పోతే ఇంద్రియార్థేషు వైరాగ్యం - ఇంద్రియార్ధాలంటే శబ్ద స్పర్శాదుల వల్ల కలిగే సుఖానుభవం. అది ఐహికమైనా ఆముష్మికమైనా వాటి కోస మాశ పడ గూడదు. ఆ రాగమే సాధకుడికి ప్రబలమైన శత్రువు. కనుక వాటిమీద విరక్తి ఏర్పడాలి. అనహంకార ఏవచ - నేను గాబట్టి ఇంత గొప్ప కార్యం సాధించ గలిగాననే అభిమానం పెట్టుకోరాదు మరలా అది నీ విస్తారాన్ని తగ్గించి సంకుచితంగా మార్చి చూపుతుంది. పోతే జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం జననం మరణం ఎప్పుడూ గుర్తు వస్తుండాలి నీకు. ఆ రెండింటి నడుమా నీవు బ్రతికే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు