#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

మయి చానన్య యోగేన - భక్తి రవ్యభిచారిణీ
వినిక్త దేశ సేవిత్వ - మరతి ర్జన సంసది - 10

  ఇప్పుడీ వర్ణిస్తున్న దైవగుణాలిదే మొదటిసారి గాదు. ఇంతకుముందే చెప్పా మొక మాట. దైవ సంపద్వర్ణన నాలుగు మార్లు వస్తుంది భగవద్గీతలో. మొదట సాంఖ్యయోగంలో వచ్చింది. అక్కడ దానికి స్థిత ప్రజ్ఞ లక్షణాలని పేరు. తరువాత భక్తి యోగంలో వచ్చింది రెండవ మారు. అక్కడ యో మే భక్తస్సమే ప్రియః అని భక్తుడి లక్షణాలుగా వర్ణించాడు. తరువాత ఇప్పుడీ క్షేత్రజ్ఞాధ్యాయంలో వర్ణిస్తున్నాడు మూడవసారి. పోతే నాలుగవసారి గుణ త్రయాధ్యాయంలో గుణాతీతుడి లక్షణాలంటూ వర్ణించబోతాడు. నన్నడిగితే భగవత్పాదులు చెప్పి నట్టివన్నీ ఒకటే. పేర్లు పెట్టటంలో మార్పే గాని గుణ సంపదలో తేడా లేదు. ఇవి సిద్ధుడికి లక్షణాలైతే సాధకుడికి ప్రయత్న సాధ్యమంటారు భాష్యకారులు.

  ఇందులో మొట్టమొదటిది అమానిత్వం. మానిత్వ మంటే ఆత్మ స్తుతి. తన్ను తాను పొగుడుకోటం. అది లేకుంటే అమానిత్వం. ఎంత గొప్పతనమున్నా నాదేముందండీ చాలా చిన్నవాడనని వినయంగా మెలగటం. అదంభిత్వం దంభ మంటే డంబం. తాను చేసే ధర్మకార్యాలొకరు గుర్తించారో లేదోనని పదిమందికీ ప్రకటించటం -ప్రదర్శించటం. అలా ప్రదర్శించకుండా కేవల మది మంచి పని అని పాటిస్తూ పోవట మదంభిత్వం. అహింసా. తోడి మానవులనే గాదు ఏ ప్రాణినీ కూడా పీడించకుండా దయ గలిగి ఉండడం. క్షాంతిః - అన్ని

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు