ఫలాభిలాష వల్ల బుద్ధి కలుషితం కాదు. సత్కర్మాచరణ వల్ల మీదు మిక్కిలి పరిశుద్ధ మవుతుంది. తద్వి శుద్దం ప్రసన్న మాత్మా లోచన క్షమం భవతి. విశుద్ధమైన ఆ మనస్సు వాడికాత్మ విచారాభి ముఖంగా మారుతుంది. అలా ఆత్మ జ్ఞానాని కభిముఖుడయి అందులో వాడు క్రమంగా నిష్ఠ అనేది ఎలా పొందుతాడో అది వర్ణిస్తున్నా డిప్పుడు గీతాచార్యుడు.
న ద్వేష్ట్య కుశలం కర్మ - కుశలే నానుషజ్జతే
త్యాగీ సత్త్వ సమా నిష్టో - మే ధావీ ఛిన్న సంశయః - 10
ఇంతవరకూ సాధకావస్థ అయితే ఇప్పుడు వాడిది సిద్ధావస్థ. ఇంతకు ముందే పేర్కొన్నాము గదా సాధన చేస్తున్నంత వరకది శిక్షణ అని. అది పరిపాకానికి వస్తే సిద్ధి అని. ఒక విధంగా చెబితే మొదటిది కర్మ యోగం. రెండవది జ్ఞాన యోగమని చెప్పినా చెప్పవచ్చు. అప్పుడు గీతాశాస్త్రాని కేక వాక్యత కూడా చెప్పినట్టవుతుంది. కర్మ జ్ఞాన మివి రెండే గదా మొదటి నుంచీ గీత మనకు బోధిస్తూ వచ్చింది. రెండూ రెండుగా గాదు మరలా. అవినాభావంగా. జ్ఞానం మన స్వరూపమైతే కర్మ మన విభూతి. ఒకటి కూటస్థం మరొకటి దాని విస్తారం. ఒకటి అచలం. మరొకటి దాని చలనం. అదే అచలం అదే చలం కాబట్టి రెండూ ఒకే తత్త్వం. అదే యోగమనే మాట కసలైన అర్థం. ఇప్పుడు కూడా అదే అద్వైత భావాన్ని పరామర్శిస్తున్నాడీ పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా. అక్కడక్కడ చెదురు
Page 430