స్వరూపాన్ని శరీరం మేరకు తగ్గించి చూపే దొకటి. శరీరానికి భిన్నంగా మరొక ప్రపంచమనే శరీరాన్ని చూపి నిన్ను భయపెట్టే దొకటి. వీటివల్లనే నీవు మిధ్యాత్మ వయి ఈ బాహ్య జగత్తు గౌణాత్మగా నీకు దర్శనమిస్తున్నది నిత్యమూ. దీనివల్ల నీవు జీవితాంతమూ నీ విశేష జ్ఞానంతో తృప్తి పడవలసిందే గాని సర్వవ్యాపకమైన సాక్షి జ్ఞానానికి నోచుకోలేవు. అలాటి అఖండ జ్ఞానమే కరువైతే నీకిక మోక్షాన్ని గూర్చిన ఆశ లేదు సుమా.
కనుక ఇంతకూ సారాంశ మేమంటే రాజస తామస బుద్ధితో కర్మలు పరిత్యజించినా జ్ఞానానికి నోచుకోలేడు మానవుడు. అలాగని కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి వదలకుండా కర్మ లాచరించినా నీకు జ్ఞాన ముదయించదు. మరేమిటంటారు. కర్మ గాదు నీవు వదిలేయ వలసింది. విహితమైన సత్కర్మలు చేస్తూనే పో. కాని అలా చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాననే అహంకారాన్నీ - నాకోసమనే మమకారాన్నీ - వదిలేస్తూ చేయా కర్మ. అలా చేస్తే నీకు ఫలిత మిస్తుందని భగవానుడు మనకిచ్చే సలహా.
అది ఎలాగో ఆ ప్రక్రియ మనకు చక్కగా ప్రదర్శిస్తున్నారు భాష్యకారులు. యస్తు అధికృతః సంగం త్యక్త్వా ఫలాభి సంధించ నిత్యం కర్మ కరోతి - కర్మ కధికారి అయి ఎవడైతే సంగమూ ఫలమూ రెండూ వదులు కొని కర్మ ఆచరిస్తాడో. తస్య ఫలరాగాదినా అకలుషీ క్రియ మాణ మంతః కరణమ్. నిత్యైశ్చ కర్మభిః సంస్క్రియ మాణం విశుద్ధ్యతి. వాడికి
Page 429