ఇప్పుడీ చెప్పినవి రెండూ త్యాగంగా కనిపించినా అవి నిజమైన త్యాగం కాదు. ఆభాస. ఇలాటి ఆభాస వల్ల అసలైన జ్ఞానఫల ముదయించదు. తన్నిమిత్తమైన మోక్షఫలమంత కన్నా కలగబోదు. అది నిష్ప్రయోజనం. పోతే ఇప్పుడవి గాదు చెప్పదలచింది పరమాత్మ. ఆయన వివక్షిత మిప్పుడు వర్ణించే సాత్త్వికమైన త్యాగం. ఇదీ అసలైన త్యాగం. అయితే అవెందుకు వర్ణించినట్టు. ఏది ఆ భాసో అది వదిలేసి దానికి మారుగా ఏది వాస్తవమైనదో దాన్ని గుర్తించటానికి. గుర్తించి దానినే ఆచరించటానికి. అప్పుడే సరియైన ఫలితమిస్తుందది. మొదట జ్ఞానం. తరువాత దాని ద్వారా మోక్షం.
అది ఎలాగో వర్ణిస్తున్నాడిప్పుడు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే. ఏది నీకు శాస్త్రం చేయవలసిందని విధించిందో అలాటి విహితమైన కర్మ చేస్తూ పోవాలి నీవు. మానేయ కూడదు. చేస్తూ పోతే అది మనలను బంధిస్తుంది గదా. సంసార సాగరంలో పడదోస్తుందేమో నని భయపడరాదు. కర్మ మామూలుగా బంధకమే అయినా రెండు షరతులు నీవు మరవకుండా పాటిస్తూ చేశావంటే అది నిన్నెప్పుడూ బంధించదు. బాధించదు. అవేమిటో చెబుతున్నాడు. ఒకటి సంగం. మరొకటి ఫలం. సంగమనేది ఇది నేను చేస్తున్నా ననే కర్తృత్వ బుద్ధి. ఫలమనేది ఇది నాకు తప్పకుండా ఫలించాలనే భోక్తృత్వ బుద్ధి. ఇవే అహం మమలు. నీ
Page 428