#


Index

మోక్ష సన్న్యాస యోగము

దుఃఖమిత్యేవ య త్కర్మ - కాయ క్లేశ భయాత్యజేత్
సకృత్వా రాజసం త్యాగం - నైవ త్యాగ ఫలం లభేత్ - 8

  అసలు విషయం తెలియకుండా కావాలని కర్మలు మానేస్తే అది తామసమైన త్యాగమని ముందు వర్ణించాడు. ఇప్పుడు తెలిసికూడా దొంగెత్తు వేసే రాజస త్యాగుల విషయం చెబుతున్నాడు. తామసుల కన్నా అన్యాయం వీరు. ఎందుకంటే వారి కసలు విషయమే తెలియక వదిలేశారు. వీరు విషయం తెలిసి కూడా చేయట మిష్టం లేక బద్ధకిస్తున్నారు. ఎందుకని. దుఃఖమిత్యేవ. పని చేయాలంటే అది ఒక ప్రయాస. దుఃఖమంటే ఇక్కడ కష్టం శ్రమ అని అర్థం. శ్రమ పడట మిష్టం లేదు వీరికి. అంతే కాదు. కాయ క్లేశ భయాత్ త్యజేత్. శరీరాన్ని కష్టపెట్టట మిష్టం లేదు. అది ఒక భయం. ఆ భయంతో కూడా మానేస్తారు కర్మ. అంటే ఒళ్లోముకొని సోమరులయి బ్రతుకుతుంటారు. ఇదే రాజసమైన త్యాగమంటే. ఏదో త్యాగం చేసినట్టు పైకి ప్రదర్శనే గాని నిజంలో ఇది త్యాగమే గాదు. త్యాగా భాస. ఇలాటి నకిలీ త్యాగం వల్ల న ఫలం లభేత్. త్యాగఫలం లభించ బోదు వీరికి.

కార్యమిత్యేవ యత్కర్మ - నియతం క్రియతే ఽర్జున
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగ స్సాత్త్వికో మతః - 9

Page 427

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు