#


Index

మోక్ష సన్న్యాస యోగము

అలా ఊరక కూచో లేవసలు. కార్యతే హ్యవశః కర్మ. ప్రకృతి గుణాలే బలవంతంగా చేయిస్తాయి నీచేత.

  అయితే ఇక జ్ఞానమార్గంలో సాధన చేసి ఏమి ప్రయోజన మంటావా. అవి చేస్తున్నా కర్తృత్వాది బుద్ధి వదులు కొంటూ చేయమని అందుకే గదా సలహా ఇచ్చాము. యజ్ఞదానాదులు కూడా మామూలు యాంత్రికంగా గాక జ్ఞాన దృష్టితో చేయమని కూడా అందుకే గదా బోధించా మంటాడు. ఇంత అసిధారా వ్రతం దేనికంటే ఇంకా శిక్షణ పూర్తి కాలేదు గదా అందుకోసమీ జోడు గుఱ్ఱాల స్వారి తప్పదంటాడు. అలా కాక నీ సొంత తెలివి ఉపయోగించి మోహాత్తస్య పరిత్యాగః తెలిసీ తెలియక ఏదో వ్యామోహంలో పూర్తిగా కర్మలు వదిలేసి పామరంగా బ్రతుకుతూ పోయావో తామసః పరికీర్తితః - అది కేవలం తామసమైన బ్రతుకని పించుకొంటుంది. పశుపక్ష్యాదుల జీవిత మెలాంటిదో అలాంటిదే నీ జీవితం కూడా. తేడాలేదని బెదిరిస్తున్నాడు పరమాత్మ. జిజ్ఞాసువైన వాణ్ణిలా బెదిరించ నక్కర లేదనుకోండి. అయినా వాడికాత్మ భావన ఇంకా దృఢ పడిందో లేదో లేకుండానే అన్ని డ్యూటీలూ ఎగగొట్టి తిరుగతున్నాడేమో ఎలా తెలుస్తుంది. అలా బేకారుగా వీడు తిరగటం చూచి మిగతా లోకులు కూడా వాడే మానేశాడు మనమెందుకు శ్రమ పడాలని వారూ మానేస్తారేమో అది ధర్మ విప్లవానికి దారి తీస్తుందని భయం.

Page 426

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు