#


Index

మోక్ష సన్న్యాస యోగము

రెండింటి నడుమా పడి నీ ఆత్మ భావన నలిగిపోతుంది. నలిగిపోయి ప్రత్యగాత్మగా గాక నిన్ను జీవాత్మగా మార్చి చూపుతుంది. అదే సంసార బంధానికి మార్గం.

  కనుక ఇలాటి అనర్థాలు రెండూ ఉన్నంత వరకూ నీవు యజ్ఞం చేయి తపస్సు చేయి దానం చేయి. అవి మామూలు శాస్త్ర చోదితమైన కర్మలే గాని మేము చెప్పే జ్ఞానాత్మకమైన కర్మలు కావు. కాకుంటే పావనాని అనే మాట కర్థం లేదు. కాబట్టి ఇంతకూ యజ్ఞాదులేవి నీవు పాటించినా కర్తృత్వ భోక్తృత్వ బుద్ధులు రెండూ పెట్టుకోకుండా కర్త వ్యానీతి ప్రారబ్ధవశాత్తూ నేను పాటిస్తూ పోవలసిన ఒక డ్యూటీ అనుకొంటూ చేయాలవి. ఆత్మ భావనతో చూస్తేగాని అలా చేయలేవు. అలా చేస్తే గాని ఆత్మభావన నిలవదు నీకు. నిశ్చితం మత ముత్తమం. ఇదీ నా నిశ్చితమైన అభిప్రాయం. చేయటమూ కాదు మానటమూ కాదు. ఏది చేసినా అహం మమలు వదిలేసి జ్ఞానం కోసమని జ్ఞాన దృష్టితో చేస్తూ పోవటమే నేను నీకిచ్చే సలహా. ఆ దృష్టే నిన్ను కర్మ బంధం నుంచి బయటపడేస్తుందని హామీ ఇస్తానంటాడు పరమాత్మ.

  ఇక్కడ భాష్యకారులు చెప్పే మాటేమంటే సాధకుడింకా కర్మాధికారి కాబట్టి నిత్య నైమిత్తికాదులు వాడికి తప్పవు. అయితే ఈశ్వరార్పణ బుద్ధితో నిరహంకారంగా ఆచరిస్తే అది ఆత్మ జ్ఞానానికి దారి తీస్తుంది. మరి

Page 424

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు