#


Index

మోక్ష సన్న్యాస యోగము

ఆత్మ భావన ఎప్పుడూ ఉండాలనేది మాత్రం షరతు. అలా కాకుంటే అది మామూలు కర్మే అవుతుంది. అయితే అది నిన్ను బంధిస్తుంది. సంసారంలో పడదోస్తుంది. మరి భావన అన్నారే అది ఎలాంటిదా భావన దాన్ని ఎలా పాటించాలని ప్రశ్న. దానికి జవాబిస్తున్నా డిప్పుడు. ఏతాన్యపితు కర్మాణి. ఈ యజ్ఞాది కర్మలు కూడా చేయమన్నాను గదా అని గుడ్డిగా చేస్తూ పోగూడదు నీవు. పోతే ఫలిత మీయదు నీకు. స్వర్గాది ఫలమిస్తే ఇస్తుందేమో గాని మోక్ష ఫలాన్ని ప్రసాదించదు. మరెలా చేయాలంటారు.

  సంగం త్యక్త్వా ఫలానిచ - ఇదుగో ఈ ఆలోచన నేను చేస్తున్నాను. దాని కనుగుణంగా జీవితమనే యజ్ఞం నేను నెరవేరుస్తున్నానని అహం భావంతో చేయరాదు. నేను నేననే కర్తృత్వ బుద్ధికే అహం భావ మని పేరు. అదే సంగం. కర్తృరూపంగా కర్మ పాశాన్ని నీ మెడకు చుట్టుకొంటున్నావు. అది సర్వతో వ్యాప్తమైన నీ స్వరూపాన్ని శరీరాద్యు పాధుల మేరకు తగ్గించి చూపుతుంది. కాబట్టి అది పూర్తిగా త్యజించాలా భావాన్ని నీవు. త్యజిస్తే నేను దీనికి కర్తననే అహంకారం తొలగిపోతుంది. అలాగే ఫలానిచ. కర్మఫలం మీద కూడా అభిలాష పనికిరాదు. నేను చేస్తున్నానని కర్తృత్వం పెట్టుకొన్నప్పుడే నాకీ ఫలితమను కూలించాలనే భోక్తృత్వ బుద్ధి కూడా ఏర్పడుతుంది నీకు. ఇదే మమకారం. అహంకార మొక కొస అయితే కర్మకు మమకారం మరొక కొస. రెండూ రెండే. ఈ

Page 423

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు