కాబట్టి ఇంతకూ భగవంతుడి నిశ్చయమేమిటో తెలిసింది గదా సన్న్యాసమనే దాని విషయంలో. ఒక్కొక్క రొక్కొక్క అభిప్రాయం వెలిబుచ్చా రింత వరకూ. ఒకరు కర్మ త్యాగమంటే ఒకరు ఫలత్యాగమంటే మరొకరన్నీ మానేసి యజ్ఞాదు లాచరించమంటే రకరకాలుగా బోధిస్తూ వచ్చారు. అవన్నీ వికల్పానికి దారితీస్తే ప్రస్తుతం పరమాత్మ వికల్పాలన్నీ త్రోసిపుచ్చి నిర్వికల్పమైన ఒక నిశ్చయ జ్ఞాన మందిస్తున్నాడు మనకు. ఏమిటది. యజ్ఞాదికం తప్ప మిగతా వేవీ పెట్టుకోవద్దని. అసలు చేయవద్దనా కర్మ. కాదు. చేసినా అది యజ్ఞమనే దృష్టితో చూస్తూ చేయమంటాడు. అలాగైతే కర్మగాదది. అకర్మే. అంటే జ్ఞానమే. జ్ఞానమనే రంగు పూసిన కర్మ. కర్మణ్యకర్మ యః పశ్యేత్తని ఇంతకు ముందు పేర్కొన్న భావానికిది రూపాంతరం.
ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ
కర్తవ్యానీతి మే పార్థ- నిశ్చితం మత ముత్తమమ్ - 6
తన సిద్ధాంతాన్నే భగవానుడింకా వివరిస్తున్నాడు. సన్న్యాస మన్నా త్యాగమన్నా అసలు మానేయటమూ గాదు. అలాగని ప్రతి ఒక్కటీ చేస్తూ పోవటమూ కాదు. చేస్తున్నా చేయనిదేదో అదీ త్యాగమనే మాట కర్థం. నైవ కించిత్కరోమీతి - పశ్యన్ శృణ్వన్నని ఈ రహస్యమే బయపెట్టాడింతకు పూర్వం. ఆత్మ భావనతో చేసిందేదీ కర్మ కాదు. అది జ్ఞానమే. అయితే
Page 422