యజ్ఞదాన తపః కర్మ - న త్యాజ్యం కార్యమేవ తత్
యజ్ఞో దానం తపశ్చైవ - పావనాని మనీషిణామ్ - 5
యజ్ఞం దానం తపస్సు ఇవి మూడే ఆ సాత్త్వికమైన కర్మ. మామూలుగా మానవులు చేసే యజ్ఞాలూ దానాలూ తపస్సులూ మోక్షమార్గానికి పనికిరావు. అవి నిత్య నైమిత్తికాది విధుల క్రిందికి వస్తాయి. కేవల కర్మేగాని అది జ్ఞానం కాదు. అలాటి యాంత్రికమైన కర్మానుష్ఠానం కాదిప్పుడు భగవానుడు మనకు సిఫారసు చేయటం. మరేమి టంటారు. ఆత్మజ్ఞానానికి దోహదం చేసేదీ - జ్ఞానోదయమైన తరువాత జ్ఞాన నిష్ఠకు తోడ్పడేదీ ఏదో అది. అది మూడు విధాలుగా కనిపిస్తున్నా అర్థం చేసుకొంటే ఒకటే. చెప్పాము గదా బ్రహ్మాకార వృత్తి తపస్సు - తదనుగుణమైన జీవితం యజ్ఞం. దానినే పదిమంది జిజ్ఞాసువులకూ పంచి పెట్టటం దానం. అప్పటికది ఒకటి గాక రెండు మూడెలా అవుతుంది. ఇందులో తపోరూపంగా జ్ఞానానికి పూర్వరంగమైతే యజ్ఞదాన రూపంగా అది జ్ఞానాని కనంతరం. జ్ఞానం విజ్ఞానమని జ్ఞానం జ్ఞాన నిష్ఠ అనీ జ్ఞానం అనుభవమనీ దీనినే ఎన్ని పేర్లతోనైనా వ్యవహరించ వచ్చు మనం.
ఇందులో ఆత్మజ్ఞాన మనేది అనుస్యూతంగా మూడింటిలో చోటుచేసుకొనే ఉంటుంది కాబట్టి యజ్ఞ దాన తపోరూపమైన కర్మ కర్మగా కనిపించదు జ్ఞానికి. సాధక దశలో జిజ్ఞాసువైనా వాడి కది జ్ఞానమే అలా
Page 420