వదిలేయండి గాని యజ్ఞాదులైన సత్కర్మలు మోక్ష సాధనాలు కాబట్టి వాటిని మాత్రం వదిలేయ గూడదంటారు.
ఇవి మూడూ కర్మ సన్న్యాస విషయంలో మనకు కనిపించే మూడు వికల్పాలు. వికల్ప మున్నంత వరకూ అది నిశ్చయ జ్ఞానాన్ని అందివ్వదు. నిశ్చయ మెప్పుడూ నిర్వికల్పమే. ఇప్పుడర్జునుడు కోరిందేమిటి. సన్న్యాస త్యాగ శబ్దాలకు నిష్కర్షగా అర్థమేమిటో చెప్పమని. చెప్పాడు భగవానుడు కొంతవరకూ. కర్మ అయితేనేమి. ఫలమైతేనేమి. వదులుకోటమనే అర్థంలో రెండూ ఒకటేనని. కాని అలా చెబుతూనే మరలా ఆ వదులుకోటంలో మూడు వికల్పాలు బయటపెట్టాడు. అవికూడా తన మతంకాదు వారూ వీరూ అనే మాటలని పేర్కొన్నాడు. అయితే తన మతమేమి టింతకూ. అది కావాలిప్పు డర్జునిడికి. ఇందులో అంతరార్ధ మేమిటంటే మానవుడి మనస్సే సవికల్పం. దానితో ఎవడేది చెప్పినా అది వికల్పానికే దారి తీస్తుంది. నిర్వికల్పం కాదది. పోతే మానవుడి బుద్ధి కతీతమైన స్థాయి భగవానుడిది. కాబట్టి ఆయనగారు నిష్కర్ష చేసి చెప్పిన దేదో అదే నిశ్చయ జ్ఞానమిస్తుంది మనకు. అలాటి నిశ్చయమేదో అది వర్ణించి చెబుతున్నా డిప్పుడు.
నిశ్చయం శృణుమే తత్ర త్యాగే. త్యాగ మంటున్నాడు చూడండి. సన్న్యాస మనటం లేదు. అప్పటికి సన్న్యాసం త్యాగం రెండూ ఒకటేనని
Page 418