సాధన మవుతుంది. సర్వం కర్మాఖిలం జ్ఞానే పరిసమాప్యతే అనేగీతా వాక్యంలో ఇమిడి ఉన్న ఆంతర్యం కూడా అదే. కనుక మార్గానికి విజాతీయమైన కర్మలు దోషవంతమని మానేసినా దానికి సజాతీయమైన యజ్ఞాది సత్కర్మలు మానేయ రాదని వీరి భావం. అది మరలా పశుహింసాది యజ్ఞాలూ శరీర శోషణాది తపశ్చర్యలూ గోభూహిర ణ్యాది దానాలూ నని అపోహ పడరాదు. అవి మోక్షమనే గమ్యాన్ని చేర్చలేవు. స్వర్గాదుల వరకే వాటి ప్రయాణం. కనుకనే యజ్ఞాది కర్మలకు బాహ్యార్ధం గాక వాటి అంతరార్థం చెప్పవలసి వచ్చింది.
నిశ్చయం శృణు మేతత్ర - త్యాగే భరత సత్తమ
త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ స్సంప్రకీర్తితః - 4
సరే మంచిది. ఇప్పుడింతకూ మూడు మతభేదాలు పేర్కొన్నాడు. భగవానుడు. మూడింటిలోనూ త్యాగమన్నా సన్న్యాస మన్నా రెండింటికీ అర్థమొకటే నని తేలిపోయింది. కాగా మొదటి మతంలో కామ్యకర్మలు వదిలేస్తే అది సన్న్యాస మనీ - అన్ని కర్మలూ ఆచరిస్తూ వాటి ఫలాన్ని వదిలేస్తే అది త్యాగమనీ - కొంచెం తేడా చూపారు. రెండూ వదిలేయటమే కాబట్టి తేడా చూడనక్కర లేదు మనం. పోతే రెండవ వారి మతంలో కర్మ లేవైనా అవి మోక్ష సాధనాలు కావు కాబట్టి అన్నీ వదిలేయటమే వాంఛనీయం. ఇక మూడవ వారి అభిప్రాయంలో అన్నీ వదిలేస్తే
Page 417