వారైతే అసలు భగవానుడే వారిని స్మరించడు. దోషవంత మెందుకయింది కర్మ అంటే చెబుతున్నారు భాష్యకారులు బంధ హేతుత్వాత్తని సమాధానం. నిషిద్ధ కర్మలలాగానే నిత్య నైమిత్తి కాది విధులు కూడా లోకాంతరాలకూ జన్మాంతరాలకూ దారి తీసేవే. మరలా మనలను సంసార సాగరంలో పడదోసేవే. అలాంటప్పుడు బంధ హేతువులు గాక మోక్ష హేతువులెలా అవుతాయి.
ఇది ఒకరి అభిప్రాయమైతే ఇక కొంత మంది అభిప్రాయమేమిటో తెలుసా. యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం. మిగతా కర్మలన్నీ వదులుకొన్నా నష్టమేమీ లేదు గాని యజ్ఞమూ దానమూ తపస్సనే మూడు కర్మలూ మాత్రమెప్పటికీ పరిత్యజించ రాదు. అవి ఎప్పుడూ జీవితంలో ఆచరిస్తూనే పోవాలంటారు. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాడు శ్రద్ధాత్రయా ధ్యాయంలో అవి మూడూ సాత్త్వికంగా చేస్తే చాలా గొప్ప ఫలితముంది వాటికని. వాటి అంతరార్థ మేమిటో అప్పుడు మేము వివరించాము కూడా. సంగ్రహంగా చెబితే ఇందులో తపస్సనేది మనస్సులో కలిగే ఆలోచన. ఈశ్వరాకారమైన చిత్తవృత్తి. యజ్ఞమంటే ఆ అఖండాకార వృత్తి కనుగుణంగా దైనందిన జీవితాన్ని మలుచుకోటం. మరి దానమేమిటి. ఆ బ్రహ్మ జ్ఞానాన్నే అర్హులైన వారందరికీ అందిస్తూ పోవటం - మొదటిది విచారమైతే రెండవది ప్రచారం. అప్పుడే మోక్షమనే గమ్యాన్ని చేరటాని కది సరియైన
Page 416