త్యాగమనేమాట కర్థమని తీర్మానిస్తారు. అప్పటికి సన్న్యాసానికీ త్యాగానికీ తేడా ఉంది వారి దృష్టిలో. నిత్య నైమిత్తిక కామ్యాలనే మూడింటిలో కామ్య కర్మలే అసలు చేయకుండా మానేస్తే అది సన్న్యాసం. నిత్య నైమిత్తికాలు రెండూ మానేయకుండా అనుష్ఠిస్తూ వాటి ఫలితాన్ని మాత్రం వదిలేస్తే అది త్యాగం. ఇదీ వారు చెప్పే తేడా రెండింటికీ. అయితే అది కర్మో ఫలమో మాకక్కర లేదు. వదిలేయట మనేది మాత్రమే పరిగణిస్తే మాత్ర మా విషయంలో తేడా లేదు. రెండే ఒకటే నంటారు భగవత్పాదులు తమ వ్యాఖ్యానంలో.
త్యాజ్యం దోషవ దిత్యేకే - కర్మ ప్రాహు ర్మనీషిణః
యజ్ఞ దాన తపః కర్మ- న త్యాజ్యమితి చాపరే -3
పోతే మరి రెండు మతాలు కూడా వర్ణించి చెబుతున్నాడు భగవానుడు. త్యాజ్యం దోష వదిత్యేకే. కర్మ అంటేనే అది ఏదైనా గానీ దోషభూయిష్ఠమే. కనుక అది నిత్యమా నైమిత్తికమా కామ్యమా అని గాదు సాధకుడు చూడవలసింది. ఏదైనా సరే. నిర్దాక్షిణ్యంగా వదిలేయటమే మంచిది. దోషముందని తెలిసినప్పుడు చేయటం తప్పు గదా. అసత్కర్మ లాచరిస్తే సత్ఫలితమెలా లభిస్తుంది మనకు. కర్మలన్నీ అసత్తే నన్నప్పుడన్నీ వదులుకోవలసిందే నంటారు కొదరు మనీషులు. మనస్తత్త్వం బాగా తెలిసినవారే ఈ మాట అంటున్నారు గాని అల్లాటప్పా వారు గారు. అలాంటి
Page 415