#


Index

మోక్ష సన్న్యాస యోగము

అనేమాటలో త్యాగమనేది కూడా వినిపిస్తున్నది. అక్కడక్కడా ఇంతకుముందు అధ్యాయాలలో కూడా రెండు మాటలూ దొర్లుతూనే వచ్చాయి. ఇలాంటప్పుడు రెండూ ఒకటేనా కాదా అని ప్రశ్న రావటం సహజమే. ప్రశ్న ఉన్నంత వరకూ నిశ్చయం చేసుకొని ముందుకు సాగిపోలేము. అంచేత దానికిప్పుడు సమాధాన మిస్తున్నాడు భగవానుడు.

కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః
సర్వకర్మ ఫలత్యాగం - ప్రాహు స్యాగం విచక్షణాః - 2



  అర్జునుడంటే సూటిగా వేశాడు గాని ప్రశ్న. కృష్ణ పరమాత్మ వెంటనే ఇస్తాడా సమాధానం. ఆయన లీలామానుషుడు గదా. మభ్య పెట్టి మాటాడట మాయన కలవాటు. అలాగే ముందుగా తన మతమేమిటో ఈ విషయంలో తొందర పడి బయటపెట్టడు. వారూ వీరూ ఏమని భావిస్తుంటారో వరుసగా చెప్పి తరువాత అసలు విషయం బయట పెడతాడు. వారూ వీరంటే ఎవరు మేధావంతులే వారు. వారూ తక్కువ వారు గారు. కవయో విదుః పండితులే. ఏమంటారు వారు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం విదుః కామ్యకర్మ లేవున్నాయో వాటిని వదులుకోటం మాత్రమే సన్న్యాసమని తీర్మానిస్తారు. అలాగే సర్వ కర్మ ఫలత్యాగం. త్యాగం ప్రాహుః - కామ్యమే గాక నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఉన్నాయి గదా. అవి మాత్రమాచరిస్తూ వాటివల్ల కలిగే ఫలితాన్ని మాత్రం వదులుకోటం

Page 414

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు