అర్థం కూడా. అంచేత గడచిన పదిహేడధ్యాయాలలో బోధించిన విషయమంతా ఇందులోనే కలిసి వస్తుందట మనకు. ఏమిటది. మూడుమాటల్లో చెబితే సంగ్రహంగా ఒకటి శ్రద్ధ మరొకటి సన్న్యాసం. ఇంకొకటి మోక్షం. ఇందులో మోక్షమనేది ఫలం. అది అందుకోవాలంటే దానికి విజాతీయ భావాలన్నీ సన్న్యసించాలి మానవుడు. అలా సన్న్యసించాలంటే మొదటి నుంచీ శ్రద్ధ అనే గుణం అలవరుచుకొంటూ రావాలి. ఇదీ వీటి మూడింటికీ ఉన్న పరస్పర సంబంధం గీతాశాస్త్రార్థమంతా ఇంతే. శ్రద్ధతో అన్నింటినీ సన్న్యసిస్తే మోక్షమనే జీవిత పరమార్థం సిద్ధిస్తుంది మానవుడికి. ఇంతకూ అనులోమంగా శ్రద్ధ అయితే ప్రతిలోమంగా సన్న్యాస మనేది చేసి తీరాలి. అప్పుడే జీవిత సమస్యకు మోక్షం. ఇది మన మెవరమూ గాదు. గీతా ప్రణేత వ్యాసభగవానుడే సూచిస్తున్నాడు చరమ శ్లోకంలో. సర్వ ధర్మాన్ పరిత్యజ్య అనటంలో సన్న్యాసమూ - మోక్షయిష్యామి అనటంలో మోక్షమూ రెండూ ధ్వనిస్తున్నాయి. అలా జరగాలంటే శ్రద్ధ తప్పనిసరిగా ఉండాలి గనుక అది కంఠోక్తిగా గాకపోయినా వక్రోక్తిగా స్ఫురిస్తూనే ఉంది. ఇంతకూ శ్రద్ధ సాక్షాత్తుగా మోక్షమివ్వదు. సన్న్యాసం ద్వారానే ఫలిస్తుందది. అంచేత సన్న్యాసమే అతి ముఖ్యం సాధన మార్గంలో. అయితే సన్న్యాస మనగానే మనకు కాషాయాలూ గడ్డాలూ మఠాలూ దర్శనమిస్తాయి. అది గాదు. సన్న్యాస మంటే. మరేమి టంటారు. ఏమంటారో వ్యాసుల వారు కృష్ణార్జునుల ప్రశ్నోత్తర వ్యాజంతోనే మనకు వివరిస్తున్నారు వినండి.
Page 412