#


Index

మోక్ష సన్న్యాస యోగము

అనేదేమిటో అది ఎలా ఉండాలో మనకు బోధిస్తూ వచ్చాడు మహర్షి పదిహేడవ దానిలో శ్రద్ధా స్వరూపాన్ని నిరూపించాడు. పోతే చివరిదైన ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రద్ధ అనేది సన్న్యాసం ద్వారా చివరకు మన కభిమతమైన మోక్షాన్ని ఎలా ప్రసాదిస్తుందో నిరూపించబోతున్నాడు. ఇదీ భగవద్గీతలో గడచిపోయిన అధ్యాయాలకూ వాటికి పర్యవసానమైన ఈ ఆఖరి అధ్యాయానికీ అంతర్వాహినిగా నడుస్తున్న ప్రగాఢమైన సంబంధం. ఉపక్రమోప సంహారౌ అన్నట్టు శాస్త్రంలో పూర్వోత్తర భాగాల కిలాటి గాఢమైన సంబంధ మున్నప్పుడే అది శాస్త్రమని పించుకొంటుంది. భగవద్గీతను శాస్త్రమని గదా భగవత్పాదులు మొదటి నుంచీ వర్ణిస్తూ వచ్చారు. గీతా శాస్త్రమని ఆయన పెట్టిన పేరు. దానికి తగినట్టే అనుబంధ చతుష్టయాన్ని కూడా భగవద్గీత కన్వయించి చూపాడాయన ఉపోద్ఘాతంలో. చివరకీ కడపటి అధ్యాయంలో శాస్త్రార్థమంతా ఎలా కలిసి వస్తున్నదో అది కూడా ఉపసంహరించి చూపుతున్నా డాయన. ఆయన దీనికి వ్రాసే అవతారికలో ఏమంటున్నాడో వినండి.

  సర్వస్యైవ గీతా శాస్త్ర స్యార్థః అస్మిన్న ధ్యాయే ఉపసంహృత్య సర్వశ్చవే దార్ధా వక్తవ్యః ఇత్యేవ మర్థః అయ మధ్యాయః ఆరభ్యతే. సర్వేషు హి అతీతేషు అధ్యాయేషు ఉక్తః అర్థః అస్మి న్న ధ్యాయే అవగమ్యతే. చూచారా గీతాశాస్త్రం మనకు చెబుతూ వచ్చిన సమస్త విషయాలూ ఈ అధ్యాయంలో సమాప్తమయి పోతున్నాయట. ఒక్క గీతా శాస్త్రార్థమే గాదు. సమస్త వేదాల

Page 411

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు