#


Index

మోక్ష సన్న్యాస యోగము

వాస్తవానికి. అవిదారి ఇస్తేనే సంసారమనే అశ్వత్థ వృక్షాన్ని జ్ఞాన ఖడ్గంతో సమూలంగా ఛేదించగలం. గుణాతీతమైన పురుషోత్తమ పదాన్ని అందుకోగలమని పురుషోత్తమ ప్రాప్తి మనకు చేసే హితోపదేశం.

  ఇప్పుడిదంతా సాధించాలంటే దానికి రెండే షరతులు. అశ్రద్ధ పనికిరాదు. శ్రద్ధనే అవలంబిస్తూ పోవాలి. అశ్రద్ధ ఏ మాత్రమున్నా క్షేత్ర క్షేత్రజ్ఞులు వేరయి కనిపిస్తారు. గుణత్రయమూ అసుర సంపదా మన ప్రాణం తీస్తుంది. దాని ఫలితంగా ఈ సంసారమనే అశ్వత్థం మనదారి కడ్డు తగులుతుంది. మనలనీ బంధంలో నుంచి బయటపడ నివ్వవు. అన్ని అనర్ధాలకూ కారణ మశ్రద్ధే మానవుడికి. కాగా దీన్ని దూరం చేసుకోవాలంటే దీనికి ప్రతిలోమంగా శ్రద్ధ అనే గొప్ప గుణాన్ని సాధకుడే మరకుండా ఎప్పుడూ అభ్యసిస్తూ పోవాలి. అదీ రాజస తామసాలు గాక సాత్త్వికం. తన్నిమిత్తంగా జ్ఞానోదయమైతే దాని బలంతో ఉపాధి ధర్మాలనన్నింటినీ సన్న్యసించి మోక్షమనే సామ్రాజ్యానికే అభిషిక్తుడు కాగలడీ మానవుడు. అసి పదార్ధమైన జీవ బ్రహ్మైక్యమప్పుడే సిద్ధిస్తుంది.

  ఇంతకూ జీవిత పరమావధి అయిన మోక్షఫలాన్ని మానవుడను భవించాలంటే దాని కడ్డు వచ్చే ప్రాపంచిక భావాలన్నింటినీ సన్న్యసించటం అలా సన్న్యసించటానికి తగిన శ్రద్ధా ఇవి రెండూ అత్యావశ్యకం. ఇందులో మొదటి అధ్యాయం నుంచీ పదహారవ అధ్యాయం వరకూ శ్రద్ధ

Page 410

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు