కెంత శ్రద్ధ కావాలో అంత అనన్యమైన భక్తి కూడా ఉండాలి సాధకుడికి. అదే ఏకరువు పెడుతుంది భక్తియోగ మనే అధ్యాయం.
భక్తి అంటే అనన్యమైన జ్ఞానమే. ఆత్మా నాత్మలుగా విభక్తమై
కనిపిస్తున్న దొకే ఒక తత్త్వం. అది క్షేత్ర మనుకొంటే క్షేత్రం. క్షేత్రజ్ఞుడని
చూస్తే క్షేత్రజ్ఞుడు. ఒకే నాణానికి రెండు ముఖాలు అజ్ఞానవశాత్తూ ఇలా
భిన్నంగా భాసిస్తున్నది. వాస్తవంలో భిన్నం కాదు అభిన్నమే. కాని
అభిన్నమనే చూపుండాలి నీకు. వస్తువే ఆ భాసగా కనిపిస్తున్నది. ఇందులో
కంటే వస్తువది- కనిపిస్తే అదే ఆభాస అని శ్రద్ధతో పట్టుకోవాలా ఏకత్వాన్ని.
అలా పట్టుకోమని బోధిస్తున్నది క్షేత్రజ్ఞాధ్యాయం మనకు. దీనికి ముందు
విభూతి విశ్వరూప భక్తి యోగాలు తత్పదార్ధాన్ని శుద్ధి చేసి మనకందిస్తే
ఇక్కడి నుంచి తత్త్వం పదార్థాల అంటే జీవేశ్వరుల ఐక్యాన్ని బోధించే అసి
పదార్ధ జ్ఞానం మొదలవుతున్నది. జ్ఞానమేమో మొదలవుతున్నది. కాని
ఆజ్ఞానం మనకు ఒంటబట్టాలిగా. అంత సులభంగా పట్టదది. కారణం
ప్రకృతి గుణాలు మన బుద్ధి కడ్డు తగులుతుంటాయి. అవి క్రమంగా
తమస్సును రజస్సులోకి రజస్సును సత్త్వంలోకి మార్చుకొని చివర
కాసత్త్వాన్ని కూడా జ్ఞానంతో శుద్ధి చేసుకోవాలి సాధకుడు. అదే బోధిస్తున్నది
గుణత్రయాధ్యాయం. అది శద్ధతో సాధించాలంటే అసుర సంపదను
క్రమంగా త్రోసి పుచ్చి దైవసంపద నలవరుచుకొనే శ్రద్ధ ఉండాలి మరలా.
కనుకనే దైవాసుర సంపదధ్యాయం. గుణత్రయ దైవాసురా లొకటే
Page 409