అయితే ఇక తత్పదార్ధమైన ఈశ్వర భావ మొకటుంది. అది తన పరాపర ప్రకృతుల ద్వారా సృష్టి ప్రవేశాదులు చేస్తున్నంత వరకూ వాచ్యార్ధమే. అది శుద్ధి అయితేనే గాని దాని లక్ష్యార్ధమైన పరమాత్మ కాదు. ఇందులో ఈశ్వర భావం చెబుతుంది మొదట జ్ఞాన విజ్ఞానయోగం. దాని సగుణ రూపాన్ని ధ్యానిస్తూ సగుణ బ్రహ్మ సాయుజ్యం పొందవచ్చునని చెబుతుంది అక్షర పరబ్రహ్మ యోగం. ఆ తరువాత నిర్గుణమైన పరమాత్మ తత్త్వమేదో నిరూపించి సమ్యగ్ జ్ఞానం ద్వారా అని నందుకో అది నీ ఆత్మ స్వరూపమే నని వర్ణిస్తుంది. రాజవిద్యా రాజగుహ్యం. ఇందులో దేనికి తగిన శ్రద్ధ దాని కుండ వలసిందే. తప్పదు. లేకుంటే ధ్యాన సిద్ధి లేదు నీకు. జ్ఞాన సిద్ధి లేదు.
మరి ఈ ధ్యాన జ్ఞాన మార్గలేమిటి. ఇవి రెండూ వేరు వేరు మార్గాలా. రెండూ ఒకటేనా అని అడిగితే కాదు కాదు - ఒకటి యోగం మరొకటి దాని విభూతి అని చాటి చెబుతుంది విభూతి యోగం. జ్ఞానం యోగమైతే ధ్యానం చెప్పే విషయమంతా దాని విస్తారమే మరేదీ గాదు. ఇది అర్థం చేసుకోటానికి కూడా శ్రద్ధ కావాలి మరలా మనకు. అలా అర్థం చేసుకొనే విజ్ఞానమే దివ్యదృష్టి. అఖండమైన ఆదృష్టితో చూడగలిగితే చాలు. అండ పిండాత్మకమైన ఈ విశ్వమంతా ఆత్మ స్వరూపంగానే దర్శన మిస్తుందని నిరూపిస్తుంది విశ్వరూపాధ్యాయం. కాని దానినలా ఆకళించుకోటాని
Page 408