#


Index

మోక్ష సన్న్యాస యోగము

యం పురుషః యో యచ్ఛద్ధస్స ఏవసః అని గదా ఇంతకు ముందే పేర్కొన్నాడు భగవానుడు. శ్రద్ధ లేనిదే ఏదీ సాధించ లేము. మోక్షానికి ప్రతిబంధకమైన సంసార బంధాన్నీ తొలగించుకోలేము. దానికి పర్యవసానమైన మోక్ష ఫలానికీ నోచుకోలేము. ప్రతిలోమంగా సంసారాన్ని దూరం చేసుకొంటూ అనులోమంగా సాయుజ్య ఫలాన్ని అందుకోవాలంటే రెండింటికీ ఏకైకమైన షరతీ శ్రద్ధ అనే గుణాన్ని అలవరుచుకోటమే. ఎంతెంత శ్రద్ధతో ముందుకు సాగిపోతే అంతంత సంసారమనే తమస్సు విరిసిపోయి సాయుజ్యమనే వెలుగు చూడగలం. అది పరిపాకానికి వచ్చిందంటే అసలీ సంసారమే పటాపంచెలయి నిత్య సిద్ధమైన మోక్షమే సాధకుడి అనుభవానికి రాగలదు. ఇదీ విషయం. శ్రద్ధా త్రయమనే పదిహేడవ అధ్యాయానికీ ఇప్పుడీ మోక్ష సన్న్యాసమనే పద్దెనిమిదవ అధ్యాయానికీ ఉన్న ఆంతరంగికమైన సంబంధమిది.

  అసలీ రెండింటికే గాదు. ఆ మాటకు వస్తే మొత్తం పదిహేడ ధ్యాయాలకూ ఈ పద్దెనిమిదవ అధ్యాయానికీ ఉన్నది సంబంధం. అంటే అర్థం. మొత్తం గీతా శాస్త్రాని కంతటికీ ఈ మోక్ష సన్న్యాసమే ఉపసంహార మన్న మాట. దీనితో గీతాశాస్త్రార్థ మంతా సమాప్తమయి పోతుంది. కనుక పదిహేడధ్యాయాల విషయమంతా మనసులో లేకపోయినా ఈ పద్దెనిమిదవది తూచా తప్పకుండా ఆకళించుకోగలిగితే చాలు. సాధకుడి అభిమతం నెరవేరుతుంది. ఏమిటది మోక్షం. దేనివల్ల లభిస్తుందది.

Page 406

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు