#


Index

మోక్ష సన్న్యాస యోగము

ఫలితమనేది ఆసించ లేవు. మానవుడెప్పుడే గాని ఫలితం కోసం చూస్తుంటాడు. ఇహం గాని పరంగాని ఏదైనా ప్రయోజన ముంటేనే పని పెట్టుకొంటాడు. ప్రయోజన మనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అంటారు పెద్దలు. వాళ్లన్నారనే గాదు. ఆ బాలగోపాలం మన అనుభవం కూడా అదే.

  ప్రస్తుతం మానవుల మైన మనమందరమూ కోరుకొంటున్న ప్రయోజనమేమిటి. జీవిత పరమార్ధమైన మోక్షమనే మహాఫలం. అంత గొప్ప ఫలితం వచ్చి మన ఒళ్లో పడాలంటే ఉట్రవడియంగా పడుతుందా చెప్పండి. ఎంత పెద్ద సాధన చేయవలసి ఉంటుంది. ఫలితాన్ని బట్టి ఉంటుంది గదా ప్రయత్నమనేది. ఫలితం గొప్పదయ్యే కొద్దీ దానికోసం చేసే ప్రయత్నం కూడా అంత గొప్పదే కావాలి. అదేమిటో గాదా ప్రయత్నం. సన్న్యాసం. సన్న్యాస మనే మాట ఈ అధ్యాయానికి పెట్టిన పేరులోనే కనిపిస్తున్నది మనకు. సన్న్యాస మంటే వదులుకోటమని అర్థం. దేన్ని వదులుకోవాలి మానవుడు. మోక్ష సన్న్యాస మన్నారు కాబట్టి మోక్షాన్నే వదులు కోవాలనా. అది మొదలు చెడ్డబేరం. మోక్షం కోసం గదా మన తాపత్రయ మంతా. అలాటి మోక్షాన్నే సన్న్యసించమని చెబుతుందా శాస్త్రం. అలా చెప్పటానికే అయితే శాస్త్రం దేనికి. మనమీ సంసార బాధ లను క్షణమూ అనుభవిస్తుంటే వీటి బంధం నుంచి బయట పడటానికి గదా

Page 404

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు