18. మోక్ష సన్న్యాస యోగము
శ్రద్ధాత్రయ విభాగ యోగం సమాప్తమయింది. పోతే ప్రస్తుతం మోక్ష సన్న్యాస యోగమనే పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. చిట్టచివరి అధ్యాయమిది భగవద్గీతలో. దీనికీ శ్రద్ధాత్రయానికీ ఏమిటి సంబంధమని ప్రశ్న. శ్రద్ధాత్రయంలో సాత్త్విక రాజస తామసాలని మూడు విధాలైన శ్రద్ధను పేర్కొన్నాడు. అందులో రాజస తామసాలు వదిలేసి సాధకుడైన వాడు కేవలం సాత్త్వికమైన శ్రద్దనే పెట్టుకోవాలని బోధించాడు మహర్షి అది కూడా మానసికంగా వాచికంగా కాయికంగా మనం చేసే ప్రతి పనిలోనూ పాటించా లన్నాడు. అప్పటికి మానవుడు త్రికరణాలతో చేసే ప్రతి ఒక్క చర్యా శ్రద్ధే నడుపుతూ పోవాలి. శ్రద్ధే లేకుంటే ఏ పనీ కొనసాగదు. బద్ధకించి మధ్యలోనే ఆపేస్తాము. ఆపేస్తే ఆ పనికెప్పుడూ
Page 403