శాస్త్రాన్ని ఆశ్రయించాము. అలాంటప్పుడది దీనిలో నుంచి బయటపడే మార్గం మన కుపదేశించాలి గాని దానికి మారుగా మోక్షాన్నే వదులుకోమనా చెప్పవలసింది. అసలు మనందరి అనుభవంలో ఇప్పుడున్నది సంసారమే గాని మోక్షంగాదు. అనుభవంలో ఉన్నది బాధాకరమైతే దాన్ని గదా వదులుకో వలసింది. ఇంకా అనుభవానికి రాని వస్తే నిత్య సుఖదాయకమైన మోక్షాన్ని సన్న్యసించట మేమిటి. అన్యాయం.
కాబట్టి మోక్ష సన్న్యాసమని అధ్యాయానికి మహర్షి నామకరణం చేశాడంటే మోక్షాన్నే సన్న్యసించటమని గాదు. మోక్షం కోసం సన్న్యసించ మని. మనకు కావలసింది మోక్షం. అక్కర లేనిది సంసారం. ఇది మన మోక్ష మార్గాని కడ్డు తగులుతున్నది. కనుక ఈ అడ్డు తొలగించుకొంటే చాలు. మోక్ష ఫలం మానవుడికి దక్కుతుందని వ్యాస హృదయం. మోక్షం కోసం దానికి ప్రతిబంధకమైన సంసారాన్ని సన్న్యసించాలి గాని సాయుజ్య సుఖమిచ్చే మోక్షాన్ని గాదు. దీన్నిబట్టి మోక్షస్య సన్న్యాసః అని గాక మోక్షాయ సన్న్యాసః అని సమాసానికి విగ్రహం చెప్పవలసి ఉంటుంది. అయితే మరి ఈ సన్న్యాస మెలా చేయాలి. అనుకొన్నంత సులభం కాదది. సంసారమా పొమ్మంటే పోతుందా. పోదు. అలా పోయేట్టయితే మానవుడు పుట్టినప్పటి నుంచీ ఎందరో ఎన్నో విధాల శాపనార్ధాలు పెడుతూనే ఉన్నారు దీన్ని. ఎప్పుడో తొలగిపోవలసిందే. కాని ఇంకా మనలను పట్టి పీడిస్తున్నదంటే ఏమిటి కారణం. తగినంత శ్రద్ధ లేకపోవటమే కారణం. శ్రద్ధామయో
Page 405