కాదు. అంటే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సాధకుడి కెప్పటికైనా స్వానుభవానికి వస్తుందని తాత్పర్యం.
ఏతావతా యజ్ఞతపోదానాది కర్మలన్నీ అసాత్త్వికమైనా బ్రహ్మ వాచకమైన ఓంతత్సత్తులనే శబ్ద త్రయాన్ని శ్రద్ధా పూర్వకంగా ఉచ్చరిస్తూ ఆ పనులు సాగిస్తే వాటి వై గుణ్యం తొలగిపోయి సాద్గుణ్యం వాటికి సంపాదించిన వాళ్లవుతారు అనుష్ఠాతలైన మానవులు. ఇంతకూ అలా సంపన్నం కావాలంటే ప్రతి ఒక్క పనికీ శ్రద్ధ అనేది అన్నింటికన్నా ప్రధానమైన లక్షణం. నియమం కూడా. అంచేత శ్రద్ధనే పట్టుకొని ప్రయాణం చేయాలి జీవితాంతమూ సాధకుడు. ఏమాత్రం శ్రద్ధ సడలినా అశ్రద్ధ చోటు చేసుకొంటుంది. అశ్రద్ధ కంటే ప్రబల శత్రువు లేదు.
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతంచ యత్
అస దిత్యుచ్యతే పార్ధ - నచతత్ప్రత్య నోఇహ - 28
ఎందుకంటే శ్రద్ధ వెలుగైతే అశ్రద్ద చీకటిలాంటిది. చీకటిలో చేసే ప్రయాణమే అశ్రద్ధతో చేసే ప్రయాణం. అది ఫలితమివ్వదు. మంచి చేయక పోవటమే గాదు. ఎక్కడ లేని హాని చేస్తుందది - అశ్రద్ధయా హుతం శ్రద్ధ లేకుండా చేసిన యజ్ఞంగాని తపస్తప్తం తపించిన తపస్సు గాని దత్తం - చేసిన దానం గాని - కృతం చయత్ - అసలే పని చేసినా గాని అసది త్యుచ్యతే - అది ఏమీ చేయని దానితో సమానం.