యజ్ఞాదులూ అదే. అంటే ఏమిటర్ధం. ఏ పని జరుగుతున్నా అదే నాదేమీ గాదు. దాని ప్రభావం వల్లనే దాని వెలుగులోనే జరుగుతున్నదీ క్రియ అని భావిస్తే చాలు. అది పవిత్రమే నని మహర్షి వివక్షితం.
యజ్ఞేతపసి దానేచ - స్థితి స్సదితి చోచ్యతే
కర్మ చైవ తదర్టీయం - సదిత్యే వాభి ధీయతే - 27
పోతే ఇక మూడవదైన సత్తనే మాట. వాటి లాగా ఇదీ బ్రహ్మతత్త్వాన్ని మనకు బోధించే మాటే గదా. సత్తంటే ఏమని అర్థం. ఉండటమని. దానికే స్థితి అని కూడా పేరు. అసత్తు కిది వ్యతిరిక్తం. అసత్తంటే లేకపోవటం. అప్పటికి సత్తంటే లేనిదిగాదు. ఎప్పుడూ స్థిరంగా ఉండేదని భావం. మనం చేసే పనులన్నీ అది యజ్ఞయాగాదులైన శాస్త్రీయ కర్మలే కావచ్చు. స్నానపాన భోజనాదులైన లౌకిక కర్మలే కావచ్చు. అవి చేసినప్పు డుంటాయి. మానేస్తే పోతాయి. వాటి ఫలితం కూడా అలాగే లేకుండా పోయే ప్రమాదముంది. అలా ఎప్పటికప్పుడు తీరిపోతుంటే ఏమి ప్రయోజనం. ఏదీ అనుభవానికి రాదు. వచ్చినా అది తాత్కాలికమే. శాశ్వతం కాదు.
కాబట్టి యజ్ఞే తపసి దానేచ స్థితిః - యజ్ఞాది కర్మలలా నిలిచి ఉన్నాయంటే అది స్థితే గతి కాదు. కర్మ చైవత దరీయం సత్ - తదస్థాయ మంటే ఈశ్వరార్ధంగా చేసేదని భాష్యకారుల వచనం. ఈశ్వరార్పణ బుద్ధితో దానికే ఇది సమర్పితమని చేస్తే చాలు. ఆ ఫలితం స్థితమే గాని గతం