#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

మాటలు ప్రయోగించాడాయన. అందులో యః అనే మాట క్షేత్రజ్ఞుడంటే ఎవడో వాడి స్వరూపాన్ని చెబుతుంది. అది పరిశుద్ధమైన జ్ఞానం. పోతే యత్ప్రభావః అని మరో మాట విసిరాడే మహర్షి. అందులో ఉన్నది ఉన్నదంతా. ప్రభావమంటే విభూతి అని గదా అర్థం చెప్పాము. విభూతి అనేది ఎవరిది. ఎక్కడి నుంచి వస్తుంది. స్వరూపంలో నుంచేనని వేరే చెప్పాలా. సూర్యప్రకాశం సూర్యునిలో నుంచి గాక మరెక్కడి నుంచి వస్తుంది. అంతేకాదు. దాని విభూతే గనుక దానికంటే అన్యమైన పదార్ధం కాదని కూడా తెలుసుకోవాలి మనం. అలాగే ప్రస్తుతం క్షేత్రమనేది క్షేత్రజ్ఞుడిలో నుంచి రావటమే గాదు. దాని విభూతే గనుక దానికన్నా వ్యతిరిక్తం కాదు. అప్పటికి జ్ఞానమే జ్ఞేయమైన జీవ జగద్రూపంగా భాసిస్తున్నదన్న మాట. దీనివల్ల తొంభయి తొమ్మిది ద్వైత సిద్ధాంతాలన్నీ ఎగిరిపోయి వేదాంతులు చెప్పే అద్వైత సిద్ధాంత మొక్కటే ఒక సార్వభౌముడిలాగా రాజ్యమేలు తున్నదని తేలుతున్నది.

  సరే మంచిదే. కాని ఇంతవరకూ క్షేత్రమనే దేమిటో దాని లక్షణమే చెప్పాడు గాని మహర్షి క్షేత్రజ్ఞుడి లక్షణం చెప్పలేదే. అది ఎలా ఉంటుంది. ఎలా ఉంటుందో కేవలం దాన్ని సూచన చేశాడు యో యత్రభావః అని. కాని అదేమిటో దాని ప్రభావమేమిటో మనం చెప్పుకోటమేగాని మహర్షి వర్ణించ లేదింత వరకూ. అది ఇక సవిస్తరంగా వర్ణించబోతున్నాడు. అది సావధానంగా వింటే తెలిసిపోతుంది మనకా ప్రభావమేదో గాదు ఈ క్షేత్రమేనని. దానితో అద్వైత భావం శ్రోతలకు చాలా బాగా గట్టి పడుతుంది.