#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

ప్రాణాలనే క్షేత్రగుణా లందులో సంక్రమించాయి. మనఃప్రాణ సంసర్గ మున్నంత వరకూ జీవుడి జ్ఞానం పరిశుద్ధం కాదు. అందుకే త్వంపదార్ధ శోధన చేయమని శాస్త్రం ఘోషించటం. క్షేత్రగుణాలతో కూడిన జీవచైతన్యం వాచ్యార్ధమే గాని లక్ష్యార్ధం కాదు. అంటే మనః ప్రాణాలనే మాలిన్యం క్షాళితం కాలేదు. అది క్షాళిత మయినప్పుడది ఇక జీవాత్మ కాదు. ప్రత్యగాత్మ. ప్రత్యగాత్మ అయిందో అప్పుడిక పరమాత్మకూ దానికీ తేడా లేదు. రెండూ కలిసి ఏక మవుతాయి. అదే తత్త్వమసిలో అసి పదార్ధమని మేము ఏకరువు పెట్టటం. ఇదీ విషయం.

  పోతే ఇంతవరకూ క్షేత్రం విషయమేమిటో సాంగోపాంగంగా వర్ణించబడింది. యచ్చ అనేది ఏమిటో చెప్పారు. యాదృక్ప అది ఎంత దూరం విస్తరించి ఉందో చెప్పారు. యద్వికారి అవ్యక్తం దగ్గరి నుంచి ఒకదానికొకటి ప్రకార వికారాత్మకంగా ఎలా ముడిబడి ఉన్నదో చెప్పారు. అన్నీ చెప్పారు. కాని యతశ్చయత్ ఈ క్షేత్రమనే దంతా ఎందులో నుంచి ఉత్పన్నమయిందో ఎక్కడి నుంచి వచ్చిందో అది ఒక్కటి చెప్పినట్టు కనపడటం లేదు. కనపడటం లేదంత మాత్రమే గాని అది కూడా చాలా సూక్ష్మంగా సూచన చేశాడు వ్యాసభగవానుడు. అదేమిటంటే క్షేత్రమనేది ఎక్కడి నుంచో గాదు క్షేత్రజ్ఞుడి నుంచే వచ్చింది. ఏదీ ఎక్కడ చెప్పాడా మాట అని మనకాశ్చర్యం కలగవచ్చు. అందుకే చాలా గోప్యంగా సూచన చేశాడని చెప్పింది నేను. ఏదీ ఎలాగా. సచయో యత్ప్రభా వశ్చ అని గదా క్షేత్రజ్ఞుణ్ణి వర్ణించా డాయన. యః అని యత్ప్రభావః అని రెండే రెండు