చేతన అయింది. ఇది ఎలాంటిదంటే బాగా కాల్చిన ఇనుప గుండులో చేరిన ఉష్ణగుణం లాంటిది. ఉష్ణం లోహానికి సహజం కాదు. అగ్ని వల్ల సంక్రమించినది. అలాగే బుద్ధి వృత్తికి సహజంగాదీ చేతన. ఆత్మ వల్ల తాత్కాలికంగా సంక్రమించిన దాని ఆభాస. కనుక ఇదీ క్షేత్రంలో మెంబరే. కాగా చిట్టచివర ఒకటున్నది. అది ధృతిః - ధృతి అంటే దేహేంద్రియాదు లెక్కడికక్కడ విరిగిపోకుండా పడిపోకుండా నిలిపి ఉంచేది. ఏదోగాదది. లోపల ఉన్న ప్రాణ శక్తి. అది జడమే గాని చేతనం కాదు గనుక క్షేత్రం క్రిందికే వస్తుంది.
ఇంతకూ ఒకటే మాట. అది ఆభాస జ్ఞానమే కావచ్చు. అసలు జ్ఞానమే లేని జడమే కావచ్చు. జడమై కదిలే ప్రాణ శక్తే కావచ్చు. ఏదైనా మన జ్ఞానానికి విషయంగా గోచరించిందంటే Object చాలు. అదంతా క్షేత్రమే గాని క్షేత్రజ్ఞుడని మనం భ్రమ పడరాదు. అన్నింటికీ జ్ఞేయత్వాత్తని ఒకే ఒక స్టాంపు వేశారు భగవత్పాదులు. జ్ఞేయమైనది ప్రతి ఒక్కటీ క్షేత్రమే గాని క్షేత్రజ్ఞుడని పించుకో లేదంటా రాయన. క్షేత్రజ్ఞుడే అయితే అది మన జ్ఞానానికెలా గోచరించిందని ఆయన ప్రశ్న. కాబట్టి మహాభూత పంచకం దగ్గరి నుంచీ ఆంతరమైన మనః ప్రాణాల వరకూ - ఇదంతా క్షేత్రమే. అప్పటికి జీవజగత్తులు Life + Matter రెండూ క్షేత్రమే అయి కూచున్నాయి. అలాంటప్పుడు జీవుడీశ్వరు డేనని వేదాంతులెలా చెప్పగలిగారని ఆశంక రావచ్చు మనకు. దానికి సమాధాన మేమంటే జీవుడు జీవాత్మగా ఈశ్వరుడు కాడు. ప్రత్యగాత్మగా అయితేనే ఈశ్వరుడు. జీవాత్మ అన్నప్పుడు మనః