#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

బ్రాహ్మణుడు దానివల్ల బ్రాహ్మణుడయ్యాడని చెప్పటంలో ఆశ్చర్యం లేదు. అలాగే తత్తంటే అది అని గదా అర్థం. అదేమిటి. ఆబ్రహ్మతత్త్వాన్ని చెప్పే వాక్కు. అదేదో గాదు వేదం. వాగర్ధాలకు తేడా లేదు కాబట్టి వేద మందులో నుంచి ఏర్పడ్డదని చెప్పటం కూడా సబబే. అలాగే ఆ వేదం విధించే యజ్ఞాది కర్మలు కూడా స్వర్గాది ఫలాన్ని సత్యంగానే ఇస్తాయి కాబట్టి సత్తనే మాట వల్ల పుట్టిందని పేర్కొనట మంత కాన్న సమంజసం. అప్పటికి యజ్ఞాదిక్రియలూ వాటికి మూలమైన వేదాది వాఙ్మయమూ దానికి మూలభూతమైన బ్రాహ్మతత్త్వమూ అంతా సద్రూపమూ తద్రూపమైన బ్రహ్మమే. అది మన ఆత్మ స్వరూపంగా ఏకమేననే పరిపూర్ణా ద్వైత భావమీ త్రివిధమైన నిర్దేశం వల్లనే మనకు కొట్టవచ్చినట్టు సాక్షాత్కరిస్తున్నది.

తస్మాదోమి త్యుదా హృత్య - యజ్ఞదాన తపః క్రియాః
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ -24

  అయితే ఇంత పెద్ద అద్వైత భావం రాజసతామసాలు వదలకుండా చేసే యజ్ఞాదిక్రియలలో అనుష్ఠాతల కుండకపోవచ్చు. ఉండదు కూడా. కాని ఓం తత్సత్తనే మూడింటిలో అలాటి అద్వైతార్ధం వస్తు సిద్ధంగా ఉండనే ఉంటుంది. కాబట్టి చేసే వారి కా దృష్టి ఉన్నా లేకున్నా శబ్దాచ్చారణ మాత్రం చేతనే అర్థ స్ఫూర్తి వీడికున్నా లేకున్నా ఆ క్రియ విగుణం కాకుండా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు