నిరాకారంగా దేశకాల వస్తువులన్నింటినీ వ్యాపించి ఉన్నది ఆ ఉనికే ఉండటమే Mere presence existance సత్తనే మూడవ మాట కర్థం. విష్ణు సహస్ర నామంలో సత్తా అని ఒక నామముంది. సద్విశేషం కాదు విష్ణు వంటే. కేవలం సన్మాత్రుడని అర్థం. ఉపనిషత్తు కూడా సదేవ అని చాటుతున్నదా తత్త్వాన్ని. అప్పటికే మయింది. నిర్దేశో బ్రహ్మణ స్త్రి విధః స్మృతః - కేవల సచ్చిద్రూపమయి ఆత్మ స్వరూపమైనదేదో అది బ్రహ్మమనే శబ్దాని కర్థం. అర్థం కాని అర్థం. పరమార్ధం The greatest meaning.
కాగా బ్రాహ్మణా స్తేన వేదాశ్చయజ్ఞా శ్చవిహితాః పురా. ఈ త్రివిధమైన నిర్దేశమే బ్రాహ్మణులకూ వేదాలకూ యజ్ఞాలకూ మూలభూత మంటున్నారు. పూర్వం నుంచి మహర్షులు. విహితాః అంటే నిర్మితాః అని అర్థం వ్రాశారు భాష్యకారులు. ఈ మూడు శబ్దాల వల్లనే వీరు ముగ్గురూ ఏర్పడటమేమిటి. ఇందులో చాలా అంతరార్థముంది. సర్వాణి రూపాణి విచిత్య ధీరోనామాని కృత్వాభి వదన్ యదాస్తే నామం వల్లనే రూప మేర్పడుతుంది. రూపం వల్ల నామం కాదు. ఏమిటి ఉపపత్తి.
నామమంటే పేరు గాదు - మనసులో కలిగే ఆలోచన. చిత్తవృత్తి అంటారు. అదే ప్రమాణం. దానివల్ల గ్రహించే బాహ్యమైన రూపం ప్రమేయం. దీన్ని బట్టి ప్రస్తుతం ఓమ్మంటే జీవ బ్రహ్మైక్యమని అర్థం చెప్పాము. కాబట్టి అది అనుభవానికి వచ్చిన బ్రహ్మజ్ఞాని అయిన
Page 396