#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

చర్యకు వైగుణ్యమని పేరు. దాన్నే పనికి వచ్చే విధంగా మార్చుకుంటే దానికి సాద్గుణ్యమని పేరు శాస్త్రంలో. అలాటి సాద్గుణ్యం వాటి కాపాదించి వాటికి సంక్రమించిన దోషం పోగొటట మెలాగో బయటపెడుతున్నాడు.

ఓం తత్సదితి నిర్దేశో - బ్రహ్మణ స్త్రివిధః స్మృతః
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ - యజ్ఞాశ్చ విహితాః పురా - 23

  ఓ మనే అక్షర మొకటున్నది. దానికే ఓంకారమనీ ప్రణవమనీ కూడా పేరు. అంతేగాక తత్తనీ సత్తనీ మరి రెండు మాటలున్నాయి. బ్రహ్మణ స్త్రివిధః స్మృతః - ఇవి మూడూ బ్రహ్మతత్త్వాన్ని పేర్కొనే మూడు శబ్దాలు. ఇవి శబ్దమైతే బ్రహ్మమనేది వీటి కర్ధం. శబ్దం వాచకం. అర్థం దానికి . The Sound and sense.

ఇందులో ఓమనేది సోహమనే దానిలో సకార హకారాలు లేకుండా పోతే శేషించిన అక్షరం. దానికేది అర్థమో దీనికీ అదే అర్థం. సోహమంటే ఏమిటర్ధం. అదే నేను నాకంటే అది వేరుగా లేదని. అంటే జీవుడే ఈశ్వరుడు ఈశ్వరుడే జీవుడని భావం. ఎవడా ఈశ్వరుడని ప్రశ్న వస్తే వాడు సగుణం కాదు నిర్గుణమని చెబుతుంది తత్తనే మాట. తత్తంటే అది అని అర్థం. అది అంటే ఏమిటా అది. ఫలానా అని చెప్పటానికి శక్యం కానిది. ఫలానా అంటే అది సగుణం. అలాంటిది కాదంటే ఇక నిర్గుణమే. అయితే ఎక్కడ ఉందది. ఎలా ఉంది. సగుణం గా దన్నాము గాబట్టి నిర్గుణంగా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు