#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

మరి రాజసమైన దానమెలా ఉంటుందో చెబుతున్నాడు. యత్తు ప్రత్యుప కారార్ధం ఫలముద్దిశ్య వా. మళ్లీ నాకు వాడు ఉపయోగపడతాడో లేదో పడితేనే చేయాలనే ప్రత్యుపకార బుద్ధితో చేసేది రాజసం. అంతేగాక ఫలాకాంక్షతో చేసేది కూడా రాజసమే. ప్రత్యుపకార మన్నారు. అదే గదా ఫలాకాంక్ష. అంతకన్నా వేరే ఏమున్నదని అడగవచ్చు. ప్రత్యుపకారమే గాదు ఫలమంటే. అది కేవల మైహికమైన ఫలమైతే ఆముష్మికమైన ఫలమొక టున్నది. స్వర్గాది పుణ్యలోక ప్రాప్తి అది. అక్కడికి వెళ్లి దివ్య భోగా లను భవించాలనే దృష్టి రెండు మాటలూ రెండు ఫలితాలను సూచిస్తాయంటారు భాష్యకారులు. అంటే ఇహంలో గాక పరంలోనూ తాను సుఖంగా ఉండాలని చేసే దానమిది. అంతేకాదు. పరిక్లిష్ట మన్నారు. పరిక్లేశమంటే భేదం. అయ్యో వీడికింత ధనమో ధాన్యమో ఇవ్వవలసి వచ్చిందే అని బాధ పడుతూ ఇవ్వటం పరిక్లిష్టమట. ఇదుగో ఇలాటి భావంతో చేసే దానం రాజసమైన దానమని శాస్త్రజ్ఞులు చెప్పేమాట.

అదేశకాలే యద్దాన- మపాత్రే భ్యశ్చ దీయతే
అసత్కృత మవజ్ఞాతం తత్తామస ముదాహృతమ్ - 22

  రాజసమైనా కొంత నయం. ఇప్పుడు చెప్పబోయే తామసం మరీ దారుణం. రాజసంలో దేశకాల పాత్రలైనా చక్కగా ఉన్నాయి. ఎటు వచ్చీ దానం చేసే వాడి సంకల్పమే సరిగా లేదు. ఫలాభి సంధితో మనసులో

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు