శరీరాన్నీ ఇంద్రియాలనూ తుదకు ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి కేవలం భౌతికమైన వాంఛ లేవో సాధించాలని చేసే తపస్సు. తపస్సన్నందుకు ఆపాదమస్తకమూ తపించటమే. నిజంగా తపించటమే ఇది. కృఛ్ర చాంద్రాయణ సొంతపనాది క్రియలన్నీ ఈ జాబితాలోవే. ఆఖరుకు శరీర పీడ కూడా భరించి చేయవలసిన కర్మ ఏమి పట్టిందని ప్రశ్న వస్తే చెబుతున్నాడు మహర్షి పరస్యోత్సాదనార్థం వా అని. ఎవరినో శత్రువులని భావించి వారిని సమూలంగా నాశనం చేయాలనే దురుద్దేశంతో సాగించే తపస్సట ఇది.
దీనికే అభిచారిక మని పేరు. అధర్వణాది వేదవాఙ్మయంలో కూడా వస్తుంది దీని ప్రస్తావన. ఈనాడు ప్రచారంలో ఉన్న శాతపళ్లూ బాణామతులూ ఇలాంటివే. ఇలాటి నికృష్టమైన విషయం వేదమెందుకు బోధించిందని అడుగుతారేమో. వేదమేది బోధించలేదు. మంచీ చెడ్డా అన్నీ చెబుతుంది శాస్త్రం. అది ఒక సూపరు బజారని మొదటనే మనవి చేశాను. ఎవరికేది కావాలో అదే తీసుకోవచ్చు వారు. వారి వారి కోరికల ననుసరించి వారి అభిరుచులూ వారి ప్రవృత్తులూ. విచిత్ర రూపాః ఖలు చిత్తవృత్తయః అన్నాడు భారవి. ఎవరినెవరు శాసించగలరు. మరి శాసించకుంటే అది శాస్త్ర మెలా అయిందంటారా. దాని శాసనాన్ని అనుసరించి బాగా నడచుకొని బాగుపడితే కాదనదది. అలా నడుచుకోటం
Page 390